HMD Crest Series నుంచి బడ్జెట్ ధరలో రెండు కొత్త ఫోన్లు లాంచ్.. ఫీచర్లు ఎలా ఉన్నాయంటే.!

Updated on 25-Jul-2024
HIGHLIGHTS

HMD Crest Series ను ఈరోజు భారత మార్కెట్లో విడుదల చేసింది

ఈ సిరీస్ నుంచి Crest మరియు Crest Max రెండు ఫోన్ లను విడుదల చేసింది

ఈ రెండు ఫోన్ లు కూడా గొప్ప డిజైన్ మరియు కలర్ లతో ఆకట్టుకుంటున్నాయి

HMD Crest Series ను ఈరోజు భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి Crest మరియు Crest Max రెండు ఫోన్ లను విడుదల చేసింది. ఈ రెండు ఫోన్ లు కూడా గొప్ప డిజైన్ మరియు కలర్ లతో ఆకట్టుకుంటున్నాయి. కేవలం డిజైన్ మాత్రమే కాదు ఈ ఫోన్ ఫీచర్లు కూడా ఆకట్టుకునేలా ఉన్నాయి. హెచ్ఎండి సరికొత్తగా విడుదల చేసిన ఈ రెండు ఫోన్స్ ఫీచర్లు తెలుసుకుందామా.

HMD Crest Series

ఈ సిరీస్ నుంచి Crest మరియు Crest Max రెండు ఫోన్ లను అనౌన్స్ చేసింది. ఈ రెండు ఫోన్ లు చూడటానికి డిజైన్ పరంగా ఒక విధంగా కనిపిస్తాయి. అయితే, ఈ రెండు ఫోన్ ల ఫీచర్స్ మరియు స్పెక్స్ లో కొన్ని వ్యత్యాసాలు ఉన్నాయి.

HMD Crest : ఫీచర్లు

హెచ్ఎండి క్రెస్ట్ స్మార్ట్ ఫోన్ FHD+ రిజల్యూషన్ కలిగిన 6.67 ఇంచ్ OLED స్క్రీన్ తో వచ్చింది. ఈ ఫోన్ Unisoc T760 చిప్ సెట్ జతగా 6GB ఫిజికల్ ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 50MP మెయిన్ + 2MP రెండవ కెమెరా ఉంటాయి. ఇది కాకుండా ఈ ఫోన్ లో 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కూడా కలిగి ఉంటుంది.

Also Read: Poco F6 Deadpool స్పెషల్ లిమిటెడ్ ఎడిషన్ బాక్స్ తో మరియు వివరాలు లీక్.!

HMD Crest Max: ఫీచర్లు

ఇక హెచ్ఎండి క్రెస్ట్ మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ విషయానికి వస్తే, ఈ ఫోన్ కూడా FHD+ రిజల్యూషన్ కలిగిన 6.67 ఇంచ్ OLED స్క్రీన్ తో ఉంటుంది. ఈ ఫోన్ కూడా Unisoc T760 చిప్ సెట్ తో పని చేస్తుంది. అయితే, ఈ ఫోన్ లో 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ ఫోన్ కెమెరా పరంగా, వెనుక 64MP Sony మెయిన్ కెమెరా + 5MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ వుంది మరియు 50MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ కూడా 33W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 5000 mAh బిగ్ బ్యాటరీ కలిగి వుంది.

అయితే, ఈ స్మార్ట్ ఫోన్ సేల్ కి అందుబాటులోకి రావడానికి కొంచెం టైం పడుతుంది. ఈ ఫోన్ లను అమెజాన్ ఫ్రీడమ్ సేల్ నుండి సేల్ కి తీసుకు వస్తుందని చెబుతున్నారు.

Price:

ఇక ఈ ఫోన్స్ ప్రైస్ విషయానికి వస్తే, హెచ్ఎండి క్రెస్ట్ ను రూ. 14,499 ధరతో మరియు హెచ్ఎండి క్రెస్ట్ మ్యాక్స్ రూ. 16,499 ధరతో ప్రకటించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :