Nokia 7 స్మార్ట్ఫోన్ అక్టోబర్ 31 న భారతదేశం లోలాంచ్

Updated on 24-Oct-2017

 

HMD గ్లోబల్ అక్టోబర్ 31 న హర్యానాలోని గుర్గావ్లో నిర్వహించే ఒక కార్యక్రమంలో మీడియా కు ఇన్విటేషన్  పంపింది. ఇప్పటి వరకు ఈ ఈవెంట్ గురించి పూర్తి సమాచారం లేదు. కానీ సంస్థ ఇండియాలో నోకియా 7 స్మార్ట్ఫోన్ ని  ప్రారంభించవచ్చని నమ్ముతున్నారు .

HMD గ్లోబల్ కొన్ని రోజుల క్రితం చైనాలో నోకియా 7 స్మార్ట్ఫోన్ ని  విడుదల చేసింది. ఈ డివైస్ కి 7000 సిరీస్ అల్యూమినియం చట్రం మరియు గ్లాస్ బ్యాక్ డిజైన్ ఉంది. ఈ డివైస్  5.2 అంగుళాల ఫుల్  HD IPS డిస్ప్లేను కలిగి ఉంది మరియు స్నాప్డ్రాగన్ 630 చిప్సెట్ తో  అమర్చారు. ఈ డివైస్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది, ఒక వేరియంట్  4GB RAM ఇక రెండవ వేరియంట్  6GB RAM . రెండు వేరియంట్లలో 64GB స్టోరేజ్  ఉంటుంది, ఇది మైక్రో SD కార్డు ద్వారా 128GB వరకు ఎక్స్ పాండబుల్ .

Nokia 7 లో 16MP ప్రైమరీ కెమెరా  f/1.8 అపార్చర్ అండ్  డ్యూయల్ టోన్ ఫ్లాష్ తో వస్తుంది.ఫ్రంట్ సైడ్  5MP కెమెరా f/2.0 అపార్చర్ అండ్  84 వైడ్ ఫీల్డ్ వ్యూ తో వస్తుంది .మీరు బొథీ  ఫీచర్ ద్వారా ఒకే సమయంలో ముందు మరియు వెనుక కెమెరా షూట్ చేయొచ్చు .  మరియు ఇది Facebook లైవ్ మరియు YouTube తో ఇంటిగ్రేటెడ్. కనెక్టివిటీ కోసం ఈ ఫోన్ వైఫై, బ్లూటూత్ 5.0, GPS, A-GPS మరియు గోల్డ్నాస్, NFC, 3.5mm ఆడియో జాక్ మరియు USB టైప్-సి పోర్ట్లకు సపోర్ట్  ఇస్తుంది.

ఫ్లిప్కార్ట్ లో నేడు హెడ్ఫోన్స్ మరియు బ్లూటూత్ స్పీకర్ల పై భారీ ఆఫర్స్

Connect On :