HMD Global ఇండియాలో Nokia 105 Classic ఫోన్ ను UPI పేమెంట్ ఫీచర్ తో చవక ధరలో లాంచ్ చేసింది. ఈ కొత్త ఫీచర్ ఫోన్ ను నోకియా రూ. 1,000 రూపాయల కంటే చాలా తక్కువ ధరలో ఆకర్షణీయమైన ఫీచర్లతో తీసుకు వచ్చింది. ఈ కొత్త నోకియా ఫీచర్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన అన్ని విషయాలను వివరంగా చూద్దాం.
నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ను Rs. 999 ధరతో ఇండియన్ మార్కెట్ లో నోకియా లాంచ్ చేసింది. ఈ ఫీచర్ ను ఎక్కువ కాలం మన్నేలా గట్టి డిజైన్ తో అందించినట్లు నోకియా తెలిపింది. ఈ నోకియా ఫీచర్ ఫోన్ బ్లూ మరియు చార్కోల్ బ్లాక్ కలర్ లలో లభిస్తుంది.
Also Read : Great Deal: 20 వేలకే QLED Smart tv ఆఫర్ చేస్తున్న Flipkart.!
నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ఫోన్ ఇన్ బిల్ట్ UPI అప్లికేషన్ తో వస్తుంది. అంటే, ఈ స్మార్ట్ ఫోన్ అవసరం లేకుండానే ఈ ఫీచర్ ఫోన్ తో కూడా మీరు UPI పెమెంట్స్ ను చేసుకోవచ్చు. ఈ నోకియా ఫీచర్ ఫోన్ గట్టి డిజైన్ మరియు మంచి కీప్యాడ్ తో వస్తుంది. ఈ ఫోన్ ను జేబులో పెట్టుకొని ఈజీగా క్యారీ చేయడానికి వీలుగా ఉండేలా మరియు చేతిలో మరింత కంఫర్ట్ గా ఉండేలా ఈ ఫోన్ ను అందించినట్లు కూడా చెబుతోంది.
ఈ నోకియా 105 క్లాసిక్ ఫీచర్ ఫోన్ 800mAh తో వస్తుంది కాబట్టి, ఫుల్ ఛార్జ్ చేసిన తరువాత రోజులు తరబడి పని చేస్తుంది. ఈ ఫోన్ wireless FM radio తో మరియు Improved Audio తో కూడా ఉంటుందని నోకియా తెలిపింది. ఈ ఫోన్ సింగిల్ మరియు డ్యూయల్ SIM ఆప్షన్ లలో కూడా లభిస్తుంది.
Also Read : Unlimited లాభాలను మరియు Prime Video ఉచితంగా ఆఫర్ చేసే Jio బెస్ట్ ప్లాన్.!