HMD Feature Phones: రెండు కొత్త ఫీచర్ ఫోన్ లను లాంచ్ చేసిన నోకియా యాజమాన్య కంపెనీ.!
ఇండియాలో HMD రెండు కొత్త ఫీచర్ ఫోన్ లను విడుదల చేసింది
ఈ ఫోన్ లను HMD 105 మరియు HMD 110 పేరుతో విడుదల చేసింది
గట్టి బాడీ మరియు కాంపాక్ట్ డిజైన్ తో తీసుకు వచ్చినట్లు HMD తెలిపింది
HMD Feature Phones: నోకియా యాజమాన్య కంపెనీ హెచ్ఎండి గ్లోబల్, ఇండియాలో రెండు కొత్త ఫీచర్ ఫోన్ లను విడుదల చేసింది. ఈ ఫోన్ లను HMD 105 మరియు HMD 110 పేరుతో విడుదల చేసింది. ఈ రెండు ఫోన్ లను కూడా పటిష్టమైన గట్టి బాడీ మరియు కాంపాక్ట్ డిజైన్ తో తీసుకు వచ్చినట్లు తెలిపింది. హెచ్ఎండి ఈ ఫోన్ లను నిన్న భారత మార్కెట్లో విడుదల చేసింది.
HMD Feature Phones
నోకియా యాజమాన్య కంపెనీ హెచ్ఎండి ఇప్పుడు ఇండియాలో తన సొంత బ్రాండింగ్ పేరుతో ఫోన్ లను విడుదల చేస్తోంది. నిన్న కూడా భారత మొబైల్ మార్కెట్లో HMD 105 మరియు HMD 110 ఫీచర్ ఫోన్ లను విడుదల చేసింది. వీటిలో, హెచ్ఎండి 105 ఫీచర్ ఫోన్ ను రూ. 999 ధరతో మరియు హెచ్ఎండి 110 ఫీచర్ ఫోన్ ను రూ. 1,119 ధరతో అందించింది. ఈ రెండు ఫోన్లు కూడా HMD.com నుండి సేల్ కి అందుబాటులోకి వస్తాయి.
HMD 105 & HMD 110: ఫీచర్స్
ఇక ఈ రెండు కొత్త ఫీచర్ ఫోన్ల ఫీచర్స్ విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్లు కూడా పటిష్టమైన గట్టి బాడీ మరియు రౌండ్ అంచులతో ఉంటాయి. ఈ రెండు ఫోన్లలో కూడా UPI పేమెంట్ ఫీచర్ ను కలిగి ఉంటాయి. అలాగే, ఈ రెండు ఫోన్లలో ఫోన్ టాకర్, ఆటో కాల్ రికార్డింగ్, MP3 ప్లేయర్, వైర్లెస్ FM మరియు పవర్ ఫుల్ డ్యూయల్ LED ఫ్లాష్ వంటి ఫీచర్స్ ను కలిగి ఉంటాయి.
అయితే, హెచ్ఎండి 110 ఫోన్ లో వెనుక కెమెరా సెటప్ ను కూడా అందించింది. ఈ కెమెరా సెటప్ ఈ రెండు ఫోన్లలో ప్రధాన అంతరంగా ఉంటుంది. ఈ రెండు ఫోన్ లు కూడా టైప్ C సపోర్ట్ కలిగిన 1000 mAh బ్యాటరీ కలిగి ఉంటాయి. ఈ రెండు ఫోన్ లు కూడా 9 లోకల్ లాంగ్వేజ్ ఇన్ పుట్ మరియు రెండరింగ్ కోసం 23 లాంగ్వేజ్ లకు సపోర్ట్ చేస్తుంది.
Also Read: రేపు మధ్యాహ్నం 12 గంటలకి లాంచ్ కానున్న ఒప్పో వాటర్ ప్రూఫ్ ఫోన్ Oppo F27 Pro+ 5G
హెచ్ఎండి 105 ఫీచర్ ఫోన్ బ్లాక్, పర్పుల్ మరియు బ్లూ మూడు కలర్ ఆప్షన్ లలో లభిస్తుంది. అయితే, హెచ్ఎండి 110 మాత్రం బ్లాక్ మరియు గ్రీన్ రెండు కలర్ ఆప్షన్ లలో మాత్రమే లభిస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా పెద్ద డిస్ప్లే మరియు వాయిస్ అసిస్టెంట్ సపోర్ట్ లను కూడా కలిగి ఉంటాయి.