HMD Crest: కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు సొంత బ్రాండ్ తో లాంచ్ చేస్తున్న Nokia యాజమాన్య కంపెనీ.!

HMD Crest: కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్లు సొంత బ్రాండ్ తో లాంచ్ చేస్తున్న Nokia యాజమాన్య కంపెనీ.!
HIGHLIGHTS

HMD Crest ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది

ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఇతర వివరాలతో టీజింగ్ కూడా మొదలు పెట్టింది

‘ఒక కొత్త పోర్ట్రైట్ యుగం త్వరలో వస్తుంది’ అనే ట్యాగ్ లైన్ తో ఈ ఫోన్ గురించి టీజింగ్ చేస్తోంది

HMD Crest: Nokia యాజమాన్య కంపెనీ హెచ్ఎండి కొత్త సిరీస్ స్మార్ట్ ఫోన్ లను ఇండియన్ మార్కెట్లో విడుదల చేయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ మరియు ఇతర వివరాలతో టీజింగ్ కూడా మొదలు పెట్టింది. ‘ఒక కొత్త పోర్ట్రైట్ యుగం త్వరలో వస్తుంది’ అనే ట్యాగ్ లైన్ తో ఈ ఫోన్ గురించి టీజింగ్ చేస్తోంది. సొంత బ్రాండింగ్ తో హెచ్ఎండి తీసుకు రాబోతున్న ఈ అప్ కమింగ్ ఫోన్ ఎలా ఉండబోతుందో ఒక చూద్దాం.

HMD Crest: లాంచ్

హెచ్ఎండి క్రెస్ట్ స్మార్ట్ ఫోన్ లను జూలై 25 వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇండియాలో విడుదల చేస్తున్నట్లు కనర్మ్ చేసింది. త్వరలో విడుదల చేయబోతున్న ఈ సిరీస్ ఫోన్స్ కీలకమైన ఫీచర్స్ ను కూడా అందించారు. ఈ ఫోన్ కోసం సేల్ పార్టనర్ గా Amazon ను ప్రకటించింది. అందుకే, అమెజాన్ ఇండియా నుండి ఈ ఫోన్ కీలకమైన ఫీచర్స్ తో ఆటపట్టిస్తోంది.

Also Read: Budget 2024: స్మార్ట్ ఫోన్ రేట్లు మరింత తగ్గనున్నాయా.. కొత్త బడ్జెట్ ఏం చెబుతోంది.!

HMD Crest: ఫీచర్లు

హెచ్ఎండి ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను గ్లాస్ బ్యాక్ ఫినిష్ తో అందిస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్ గొప్పగా కనిపించేలా చక్కగా నిర్మించినట్లు కూడా చెబుతోంది. ఈ ఫోన్ లో స్టన్నింగ్ విజువల్స్ అందించే స్క్రీన్ ఉందని కూడా హెచ్ఎండి చెబుతోంది. ఇది పైన సెంటర్ పంచ్ హోల్ సెల్ఫీ డిజైన్ తో ఉంటుంది. ఈ ఫోన్ ను చాలా సులభంగా సొంతంగా రిపేర్ చేసుకునే విధంగా డిజైన్ చేయబడింది అని కూడా తెలిపింది.

HMD Crest Series

ఈ ఫోన్ క్లియర్ షాట్ లను చిత్రించ కలిగిన గొప్ప కెమెరా కలిగి ఉందని కూడా హెచ్ఎండి తెలిపింది. ఈ ఫోన్ స్టేబుల్ మరియు సూపర్ ఫాస్ట్ పెర్ఫార్మెన్స్ అందిస్తుందని కూడా హెచ్ఎండి చెబుతోంది. అలాగే, ఈ ఫోన్ చాలా స్లీక్ డిజైన్ కనిపిస్తోంది మరియు కొత్త కలర్ లలో వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా కనిపిస్తోంది. ఈ ఫోన్ లాంచ్ గురించి కంపెనీ వెబ్సైట్ పైన కొత్త పేజ్ ను కూడా అందించింది. ఈ పీజే నుండి కంపెనీ టీజింగ్ చేస్తోంది. అయితే, ఈ ఫోన్ గురించి ఎక్కువ వివరాలను అమెజాన్ సైట్ మరియు కంపెనీ అధికారిక X అకౌంట్ ను అందించింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo