సామ్సంగ్ నిన్న జరిగిన నోట్ 5 అండ్ S6 ఎడ్జ్ ప్లస్ అనౌన్స్ ఈవెంట్ లో అప్ కమింగ్ స్మార్ట్ వాచ్ ను కూడా లాంచ్ చేసింది. దీని పేరు Gear S2. దీని స్పెసిఫికేషన్స్ ఇంకా అనౌన్స్ చేయలేదు కంపెని.
అయితే దీనికి ఒక విశిష్టత ఉంది. Gear S2 సామ్సంగ్ నుండివస్తున్న ఆండ్రాయిడ్ మొదటి రౌండేడ్ ఫేస్ వాచ్. ఇది సెప్టెంబర్ లో బెర్లిన్ లో జరగనున్న IFA ఈవెంట్ లో రిలీజ్ అవుతుంది.
దీని ముందు Gear S రిలీజ్ అయ్యింది. అది Tizen os మీద పనిచేస్తుంది. Tizen os పై సామ్సంగ్ Z1 స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. ఈ ఫోన్ 1మిలియన్ సేల్స్ ను అందుకుంది.
Gear S2 రూమర్డ్ స్పెక్స్ : 1.56 in 360 x 360P సూపర్ అమోలేడ్ స్క్రీన్, 1.2GHz Exynos 3472 ప్రొసెసర్, 768MB ర్యామ్, 4GB ఇంటర్నెల్ స్టోరేజ్, 250mah బ్యాటరీ, 3g కాలింగ్ సపోర్ట్. సెప్టెంబర్ 9 న దీని అఫిషియల్ స్పెక్స్ తెలుస్తాయి.