కొత్త సంవత్సరంలో కొత్త SmartPhones లాంచ్ కావడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వారం చాలా బ్రాండ్స్ కూడా వారి కొత్త ఫోన్లు లాంచ్ చేయడానికి రెడీగా ఉన్నాయి. ఇందులో వన్ ప్లస్, షియోమీ, పోకో, మోటోరోలా మరియు ఒప్పో వంటి బ్రాండ్ లు ఉన్నాయి. ఈ వారం భారత మార్కెట్లో విడుదల కాబోతున్న స్మార్ట్ ఫోన్ లిస్ట్ మరియు వాటి కీలకమైన ఫీచర్స్ ఫై ఒక లుక్కేద్దాం.
ఈ వారం ఇండియన్ మార్కెట్లో ఒప్పో నుంచి Oppo Reno 13 Series 5G, వన్ ప్లస్ నుంచి OnePlus 13 Series, పోకో నుంచి Poco X7 Series 5G, మోటోరోలా నుంచి moto G05 మరియు షియోమీ నుంచి Redmi 14C 5G స్మార్ట్ ఫోన్లు లాంచ్ అవుతున్నాయి. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ లాంచ్ డేట్ మరియు ఫీచర్స్ చూద్దాం.
రెడ్ మీ 14సి 5జి ఈ వారంలో విడుదల కాబోతున్న మొదటి ఫోన్ అవుతుంది. ఈ ఫోన్ రేపు అనగా జనవరి 6వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ రెండు ప్లాట్ ఫామ్స్ పై టీజింగ్ చేయబడుతోంది. ఈ ఫోన్ Snapdragon 4 Gen 2 చిప్ సెట్, 5160 mAh బిగ్ బ్యాటరీ, 50MP కెమెరా మరియు 120Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.88 ఇంచ్ పెద్ద స్క్రీన్ తో లాంచ్ అవుతుంది.
వన్ ప్లస్ 13 సిరీస్ నుంచి వన్ ప్లస్ 13 మరియు వన్ ప్లస్ 13R రెండు ఫోన్లు లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ లను అమెజాన్ స్పెషల్ గా లాంచ్ చేస్తోంది. ఈ రెండు ఫోన్లు కూడా జనవరి 7 వ తేదీ లాంచ్ అవుతాయి. వన్ ప్లస్ 13 ఫోన్ ను Snapdragon 8 Elite తో మరియు వన్ ప్లస్ 13R ఫోన్ ను Snapdragon 8 Gen 3 చిప్ సెట్ తో లాంచ్ చేస్తోంది. ఈ రెండు ఫోన్లు కూడా సూపర్ స్లిమ్ డిజైన్ మరియు OnePlus AI సపోర్ట్ తో లాంచ్ అవుతాయి.
మోటోరోలా బడ్జెట్ సిరీస్ గా పేరొందిన G Series నుంచి మోటో జి05 ఫోన్ ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ ను జనవరి 7వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ 100 నిట్స్ బ్రైట్నెస్ కలిగిన 6.67 ఇంచ్ స్క్రీన్, వేగన్ లెథర్ బ్యాక్, Dolby Atmos సపోర్ట్ కలిగిన డ్యూయల్ స్పీకర్లు, 50Mp క్వాడ్ పిక్సెల్ కెమెరా మరియు 5200 mAh బిగ్ బ్యాటరీ వంటి ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది.
Also Read: Flipkart Big Bachaat Days: లాస్ట్ డే భారీ డిస్కౌంట్ తో 17 వేలకే లభిస్తున్న పెద్ద QLED Smart Tv
ఒప్పో రెనో 13 సిరీస్ నుంచి రెనో 13 5జి మరియు రెనో 13 ప్రో 5జి రెండు ఫోన్లు లాంచ్ చేస్తోంది. ఈ సిరీస్ ను ఇండియా మార్కెట్ లో జనవరి 9 వ తేదీ సాయంత్రం 5 గంటలకు లాంచ్ చేస్తుంది. ఈ ఫోన్ లను Oppo AI తో సహా మరిన్ని ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేస్తున్నట్లు తెలిపింది. ఈ ఫోన్స్ మీడియాటెక్ Dimensity 8350 చిప్ సెట్, అల్యూమినియం ఫ్రేమ్, ఒప్పో సిగ్నల్ బూస్ట్ చిప్ X1, IP 69 రేటింగ్, 80W సూపర్ ఉక్ ఫ్లాష్ ఛార్జ్, 5600mAh బ్యాటరీ మరియు 50MP ట్రిపుల్ రియర్ కెమెరా వంటి ఫీచర్స్ తో లాంచ్ చేస్తోంది.
పోకో ఎక్స్ 7 సిరీస్ నుంచి X7 5జి మరియు X7 Pro 5జి రెండు ఫోన్లు లాంచ్ చేస్తుంది. పోకో ఎక్స్ 7 సిరీస్ ను జాన్ జనవరి 9వ తేదీ భారత మార్కెట్లో లాంచ్ చేస్తుంది. ఈ సిరీస్ ఫోన్ లను 50MP OIS కెమెరా, 1.5K 3D Curved AMOLED స్క్రీన్, IP 69 రేటింగ్, గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ మరియు మీడియాటెక్ Dimensity 7300 Ultra చిప్ సెట్ వంటి మరిన్ని ఫీచర్స్ తో లాంచ్ చేస్తుంది.