Lava Agni 2 5G: చైనా మొబైల్ కంపెనీలకు పోటీగా వచ్చిన ఈ ఫోన్ టాప్-5 ఫీచర్లు తెలుసుకోండి.!

Lava Agni 2 5G: చైనా మొబైల్ కంపెనీలకు పోటీగా వచ్చిన ఈ ఫోన్ టాప్-5 ఫీచర్లు తెలుసుకోండి.!
HIGHLIGHTS

20 వేల ధర కేటగిరీలోనే Curved 5G స్మార్ట్ ఫోన్ తెచ్చిన లావా

Lava Agni 2 5G ఫోన్ లో 5 టెంప్టింగ్ ఫీచర్లు ఉన్నాయి

ఈ ఫోన్ టాప్-5 ఫీచర్ల పైన ఒక లుక్కేద్దాం

లావా మొబైల్స్ కంపెనీ భారతీయ మొబైల్ తయారీ కంపెనీలలో ఒకటి. లావా ప్రస్తుతం చాలా యాక్టివ్ గా మరియు వేగంగా భారతీయ మార్కెట్ లో స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసింది. ఇటీవల కేవలం 10 వేల రూపాయల కేటగిరీలోనే 5G స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చిన లావా, ఇప్పుడు కేవలం 20 వేల రూపాయల ధర కేటగిరీలోనే Curved 5G స్మార్ట్ ఫోన్ Lava Agni 2 5G ను లాంచ్ చేసింది. ఆంతేకాదు, ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ ఫీచర్ కలిగిన ఏకైక ఫోన్ కూడా దీన్ని నిలబెట్టడం కూడా ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. అందుకే, ఈ స్మార్ట్ ఫోన్ యొక్క టాప్-5 ఫీచర్లు గురించి వివరంగా తెలుసుకుందాం. 

1. Display

ఈ ఫోన్ లో టాప్-1 ఫీచర్ డిస్ప్లే అని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ ఫోన్ లో 120Hz రిఫ్రెష్ రేట్, HDR 10+ సపోర్ట్ మరియు డబుల్ రీఇన్ఫోర్స్డ్ గ్లాస్ ప్రొటెక్షన్ కలిగిన 6.78 ఇంచ్ FHD+ AMOLED డిస్ప్లేని అందించింది. ఈ డిస్ప్లే 93.5% స్క్రీన్-టూ-బాడీ రేషియోతో వస్తుంది. 

2. Performence 

ఈ లావా స్మార్ట్ ఫోన్ మీడియూటెక్ Dimensity 7050 ఆక్టా కోర్ ప్రోసెసర్ తో పని చేస్తుందిమరియు జతగా 8GB ర్యామ్ మరియు 8GB వర్చువల్ ర్యామ్ తో మంచి పెర్ఫార్మెన్స్ అందిస్తుందని లావా తెలిపింది. ఈ ప్రోసెసర్ తో ఇండియాలో వచ్చిన మొదటి ఫోన్ గా ఇదే మరియు ఈ ఫోన్ లో 256GB హెవీ స్టోరేజ్ కూడా లభిస్తుంది. 

3. Camera 

ఈ ఫోన్ లో కెమేరా గురించి కూడా కంపెనీ గొప్పగా చెబుతోంది. ఈ ఫోన్ లో 50MP AI మ్యాట్రిక్స్ క్వాడ్ కెమేరా సిస్టమ్ వుంది. 50MP (మైన్) + 8MP (వైడ్ యాంగిల్) + 2MP(డెప్త్) + 2MP (మ్యాక్రో) సెన్సార్ లను ఏ కెమేరా సిస్టమ్ కలిగి వుంది. 

4. బ్యాటరీ & సెక్యూరిటీ 

ఈ Agni 2 5G ఫోన్ లో 4,700mAh బిగ్ బ్యాటరీ ని 66W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో అందించింది లావా. ఈ ఫోన్ In-Display ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు ఫేస్ అన్లాక్ వంటి సెక్యూరిటీ లకు మద్దతు కలిగి వుంది. 

5. OS అండ్ వారెంటీ 

Lava Agni 2 5G స్మార్ట్ ఫోన్ ను కంపెనీ క్లీన్ Android 13 OS తో అందించింది మరియు నెక్స్ట్ 2 మేజర్ అప్డేట్స్ అయిన ఆండ్రాయిడ్ 14 మరియు 15 OS లను అందుకుంటుందని కంపెనీ భరోసా ఇచ్చింది. అంతేకాదు, ముందెన్నడూ లేని విధంగా ఫోన్ లో ఏదైనా హార్డ్ వేర్ సమస్యలు తలెత్తితో కొత్త ఫోన్ ను ఉచితంగా ఇంటి వద్దనే రీప్లేస్ చేస్తానని కూడా లావా భరోసా ఇస్తోంది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo