నోకియా 1100 ఫోన్ గుర్తుందా మీకు? దీనితో ఒక hacker మరో purposeful డివైజ్ ను తయారు చేశారు. ఆవును మోస్ట్ ఫేమస్ నోకియ ఫోన్ అయిన..
నోకియా బ్లాక్ అండ్ వైట్ ఫోన్ ను స్మార్ట్ వాచ్ గా మార్చటం జరిగింది hacker డేనియల్ డవిస్. అతని వద్ద వాడకుండా పడి ఉన్న ఈ మోడల్ తో ఈ ప్రయత్నం మొదలయ్యింది..
అయితే finished ప్రోడక్ట్ అయిన ఇది మరీ సూపర్బ్ గా కనిపించదు కాని time చూపిస్తుంది, స్మార్ట్ ఫోన్ కు కనెక్ట్ అయ్యి కాల్స్ అండ్ మెసేజెస్ నోటిఫికేషన్స్ ఇస్తుంది.
దీనికి సంబంధించి డేనియల్ మూడు పార్ట్స్ గా తయారీ విధానాన్ని కూడా వీడియో చేసి అందరికీ అందించారు. సో ఇంటరెస్ట్ ఉన్న వారు ఆ క్రింద వీడియో చూసి ప్రయత్నించగలరు.
టోటల్ ప్రాజెక్ట్ కు ఏమి కావాలి, ఏలా చేయాలి అని ఒక లింక్ లో తెలిపారు డేనియల్ – tinkernut. బేసిక్ గా ఇది బ్లూ టూత్ module, నోకియా 1100, 3.7v రీచార్జ్బుల్ బ్యాటరీ అండ్ mini arduino బోర్డ్ తో తయారీ అయ్యింది.