గూగల్ modular స్మార్ట్ ఫోన్ Ara వస్తుంది

Updated on 23-May-2016

గూగల్ ప్రాజెక్ట్ Ara స్మార్ట్ ఫోన్ ఈ ఇయర్ రానుంది. మరియు ఫోన్స్ షిప్పింగ్ వచ్చే సంవత్సరం మొదలు కానున్నాయి. Ara ప్రాజెక్ట్ లో హార్డ్ వేర్ స్పెసిఫికేషన్స్ ను విడివిడిగా ఫోన్ లో attach చేసుకొని స్మార్ట్ ఫోన్ వాడగలరు.

అంటే డిస్ప్లే బ్రేక్ అయితే మీరు మరొక డిస్ప్లే ను తగిలించుకోగలరు. సర్విస్ సెంటర్ కు వేల్లనవసరం లేదు. అండ్ ఆఫ్ కోర్స్ సెపరేట్ డిస్ప్లే కొనే రిప్లేస్ చేయాలి.

వీటిని modules అంటారు. గూగల్ మొదటిగా 6 slot modules తో వస్తుంది. ఫోన్ యొక్క ఫ్రేమ్ లో CPU, GPU, డిస్ప్లే అండ్ బ్యాటరీ ఉండనున్నాయి.

ఇవి ఫ్యూచర్ లో రాబోయే changes కు అనుగుణంగా కూడా ఉంటాయి. ఆల్రెడీ LG G5 లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ మోడల్ తో modular concept ను రివీల్ చేసింది.

ఈ ఫోన్ సేల్స్ కూడా మొదలయ్యాయి. దీని ఇండియాలో కూడా సేల్ చేయటానికి రిజిస్ట్రేషన్స్ ను మొదలు పెట్టింది LG. అయితే ఇది Ara అంత ఫ్లెక్సిబుల్ modular స్మార్ట్ ఫోన్ కాదు. కాని సేమ్ కాన్సెప్ట్.

 

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport.

Connect On :