ఫైనల్ గా గూగల్ కంపెని కొత్తగా పిక్సెల్ సిరిస్ లో రెండు స్మార్ట్ ఫోనులను అనౌన్స్ చేసింది san francisco లో. ఇండియాలో Google pixel ఫోన్ ప్రైస్ – 57,000 rs అండ్ Google Pixel XL ఫోన్ ప్రైస్ – 66,000rs.
Google Pixel 32GB – 57,000 రూ, 128GB – 66,000 రూ
Google Pixel XL 32GB – 67,000 రూ, 128GB – 76,000 రూ
రెండు ఫోనులు అక్టోబర్ 13 నుండి ప్రీ ఆర్డర్స్. షిప్పింగ్/సేల్స్ అక్టోబర్ end. ఫ్లిప్ కార్ట్, రిలియన్స్ డిజిటల్ అండ్ croma స్టోర్స్ లో available గా ఉంటాయి.
వీటి గురించి తెలుసుకోవలసిన మొట్టమొదటి విషయం, ఇప్పటివరకూ గూగల్ Nexus పేరుతో లాంచ్ చేసిన ఫోనులు గూగల్ తయారు చేసినవి కావు, కాని Pixel సిరిస్ ఫోనులు సాఫ్ట్ వేర్ తో పాటు గూగల్ సొంతంగా హార్డ్ వేర్ తయారిచేసినవి.
Pixel specs – 5 in ఫుల్ HD అమోలేడ్ డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 821 SoC, 4GB LPDDR4 రామ్, 32GB అండ్ 128GB స్టోరేజ్ వేరియంట్స్, 2770 mah బ్యాటరీ.
Pixel XL specs – 5.5 in 2K రిసల్యుషణ్ అమోలేడ్ డిస్ప్లే, 3450 mah బ్యాటరీ. ఈ రెండే తేడాలు. మిగిలినవన్నీ same specs రెండింటిలో.
Pixel imprint ఫింగర్ ప్రింట్ స్కానర్, 12.3MP Sony IMX378 రేర్ అండ్ 8MP Sony IMX179 ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. గూగల్ చెప్పిన దాని ప్రకారం పిక్సెల్ ఫోనుల్లో బెస్ట్ స్మార్ట్ ఫోన్ కెమెరా ఉంది.
DXO Mark అనే కెమెరా రేటింగ్ లో 89 పాయింట్స్ వచ్చాయని వీటికి అని చెబుతుంది కంపెని. HDR+ mode, larger పిక్సెల్ సైజ్ సెన్సార్, f/2.0, 6 element లెన్స్, PDAF.
అలాగే గూగల్ 3.5mm హెడ్ ఫోన్ జాక్ ను తీయకుండా ఉంచటం కొందరికి ఆశ్చర్యంగా ఉంది. ఇంకా ఆండ్రాయిడ్ Nougat 7.1 OS with redesigned కంప్లీట్ icons – రౌండ్ డిజైన్.
aluminium unibody, రేర్ టాప్ polished గ్లాస్ బ్యాక్, ఇంబిల్ట్ గూగల్ అసిస్టంట్ సపోర్ట్, Daydream VR-compatibility ఉన్నాయి. Daydream VR ను కూడా లాంచ్ చేసింది కంపెని.
దీని ప్రైస్ సుమారు 5,250 rs, ఇది హెడ్ పెట్టుకుంటే comfort గా ఉండేలా micro fibre డిజైన్ కలిగి ఉంది. ఇంకా కొత్త chromecast ultra కూడా లాంచ్ అయ్యింది. దీనికి 4K వీడియో, యాప్స్, సపోర్ట్ తో ప్రైస్ 4,600 రూ సుమారు.(క్రింద ఇమేజ్ )