Google Pixel 9a with big deals sale starts from tomorrow
Google Pixel 9a: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ రేపటి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిన చాలా రోజులకు సేల్ కి అందుబాటులోకి వస్తోంది. ఈ ఫోన్ Flipkart నుండి సేల్ అవుతుంది మరియు ఈ కొత్త ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా గూగుల్ అందించింది. రేపు సేల్ కి అందుబాటులోకి రాబోతున్న గూగుల్ పిక్సెల్ 9a ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ను రూ. 49,999 ప్రైస్ తో లాంచ్ చేసింది మరియు ఇదే ధరతో సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC బ్యాంక్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 46,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ఫోన్ ను 6.3 ఇంచ్ ఆక్టువ pOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2D గొరిల్లా గ్లాస్ రక్షణ మరియు 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను గూగుల్ యొక్క లేటెస్ట్ Tensor G4 చిప్ సెట్ తో అందించింది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ గూగుల్ ఫోన్ Titan M2 security ప్రోసెసర్ ను కూడా జతగా కలిగి ఉంటుంది.
ఈ గూగుల్ లేటెస్ట్ ఫోన్ లో వెనుక 48MP వైడ్ మరియు 13MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ AI Camera ఫీచర్స్, 8X Zoom, 60fps తో 4K వీడియో రికార్డింగ్ మరియు గొప్ప ఫోటోలు అందించే శక్తి కలిగి ఉంటుంది. ఈ గూగుల్ ఫోన్ 5,100 mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Oppo K13 5G ఫోన్ 7000mAh భారీ బ్యాటరీ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోంది.!
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ Android 15 OS తో వస్తుంది. ఈ ఫోన్ 7 సంవత్సరాల OS మరియు రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. IP68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఎమర్జెన్సీ SOS, కార్ క్రాష్ డిటెక్షన్, సేఫ్టీ చెక్, థెఫ్ట్ ప్రొటెక్షన్ మరియు క్రైసిస్ అలర్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉంటాయి.