Google Pixel 9a Sale: భారీ ఆఫర్ తో పిక్సెల్ 9 సిరీస్ బడ్జెట్ ఫోన్ ఫస్ట్ సేల్.!

Google Pixel 9a రేపటి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది
ఈ కొత్త ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా గూగుల్ అందించింది
ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిన చాలా రోజులకు సేల్ కి అందుబాటులోకి వస్తోంది
Google Pixel 9a: గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ రేపటి నుంచి సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ అయిన చాలా రోజులకు సేల్ కి అందుబాటులోకి వస్తోంది. ఈ ఫోన్ Flipkart నుండి సేల్ అవుతుంది మరియు ఈ కొత్త ఫోన్ పై భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ని కూడా గూగుల్ అందించింది. రేపు సేల్ కి అందుబాటులోకి రాబోతున్న గూగుల్ పిక్సెల్ 9a ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
Google Pixel 9a : ధర మరియు ఆఫర్లు
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ను రూ. 49,999 ప్రైస్ తో లాంచ్ చేసింది మరియు ఇదే ధరతో సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ను HDFC బ్యాంక్ EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 3,000 రూపాయల అదనపు డిస్కౌంట్ అందుకోవచ్చు. ఈ ఆఫర్ తో ఈ స్మార్ట్ ఫోన్ ను రూ. 46,999 రూపాయల ఆఫర్ ధరకే అందుకోవచ్చు.
Google Pixel 9a : ఫీచర్స్
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ఫోన్ ను 6.3 ఇంచ్ ఆక్టువ pOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 120Hz అడాప్టివ్ రిఫ్రెష్ రేట్, 2D గొరిల్లా గ్లాస్ రక్షణ మరియు 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ ను గూగుల్ యొక్క లేటెస్ట్ Tensor G4 చిప్ సెట్ తో అందించింది. దీనికి జతగా 8GB ర్యామ్ మరియు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ గూగుల్ ఫోన్ Titan M2 security ప్రోసెసర్ ను కూడా జతగా కలిగి ఉంటుంది.
ఈ గూగుల్ లేటెస్ట్ ఫోన్ లో వెనుక 48MP వైడ్ మరియు 13MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ AI Camera ఫీచర్స్, 8X Zoom, 60fps తో 4K వీడియో రికార్డింగ్ మరియు గొప్ప ఫోటోలు అందించే శక్తి కలిగి ఉంటుంది. ఈ గూగుల్ ఫోన్ 5,100 mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
Also Read: Oppo K13 5G ఫోన్ 7000mAh భారీ బ్యాటరీ మరియు స్టన్నింగ్ డిజైన్ తో వస్తోంది.!
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ Android 15 OS తో వస్తుంది. ఈ ఫోన్ 7 సంవత్సరాల OS మరియు రెగ్యులర్ సెక్యూరిటీ అప్డేట్స్ అందుకుంటుంది. IP68 రేటింగ్ తో డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ ఫోన్ ఎమర్జెన్సీ SOS, కార్ క్రాష్ డిటెక్షన్, సేఫ్టీ చెక్, థెఫ్ట్ ప్రొటెక్షన్ మరియు క్రైసిస్ అలర్ట్ వంటి మరిన్ని ఫీచర్స్ ఉంటాయి.