Google Pixel 9a లాంచ్ అయ్యింది.. ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.!

Google Pixel 9a స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు గూగుల్ మార్కెట్లో విడుదల చేసింది
లేటెస్ట్ గూగుల్ చిప్ సెట్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ చేసింది
ఈ ఫోన్ ఏప్రిల్ నెలలో సేల్ కి అందుబాటులోకి వస్తుంది
Google Pixel 9a స్మార్ట్ ఫోన్ ను ఎట్టకేలకు గూగుల్ మార్కెట్లో విడుదల చేసింది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లో బేసిక్ వేరియంట్ అయిన ఈ ఫోన్ ఈరోజు భారత్ తో పాటు ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ను డ్యూయల్ రియర్ కెమెరా, లేటెస్ట్ గూగుల్ చిప్ సెట్ మరియు స్టన్నింగ్ డిజైన్ తో లాంచ్ చేసింది. ఈరోజే సరికొత్తగా విడుదలైన ఈ గూగుల్ ఫోన్ ధర మరియు ఫీచర్స్ తెలుసుకోండి.
Google Pixel 9a : ప్రైస్
గూగుల్ పిక్సెల్ 9a స్మార్ట్ ఫోన్ ను సింగల్ ర్యామ్ మరియు రెండు స్టోరేజ్ వేరియంట్లలో లాంచ్ చేసింది. ఇందులో బేసిక్ 8GB + 128GB వేరియంట్ ను రూ. 49,999 ధరతో లాంచ్ చేసింది. అయితే, 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ ను రూ. 56,999 ధరతో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఏప్రిల్ నెలలో సేల్ కి అందుబాటులోకి వస్తుంది. ఈ ఫోన్ ఆన్లైన్ మరియు ఆఫ్ లైన్ స్టోర్స్ లో కూడా లభిస్తుంది.
Google Pixel 9a: ఫీచర్స్
గూగుల్ ఈ ఫోన్ ను పిక్సెల్ 9 సిరీస్ అన్ని ఫోన్లు కలిగిన అదే Google Tensor G4 చిప్ సెట్ తో అందించింది. దీనికి జతగా Titan M2 security కో ప్రోసెసర్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.3 ఇంచ్ ఆక్టువా OLED స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ రక్షణతో కలిగి ఉంటుంది. ఈ ఫోన్ స్క్రీన్ 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్, 1800 నిట్స్ (HDR) బ్రైట్నెస్, HDR సపోర్ట్ మరియు 60–120 Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇది 24 బిట్ డెప్త్ డిస్ప్లే మరియు గొప్ప కలర్స్ అందిస్తుంది.
ఈ గూగుల్ ఫోన్ లో వెనుక 48MP వైడ్ మరియు 13MP అల్ట్రా వైడ్ సెన్సార్ లు కలిగిన డ్యూయల్ రియర్ మరియు ముందు 13MP సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో 60fps తో 4K వీడియోలు షూట్ చేయవచ్చు మరియు 8x సూపర్ రిజల్యూషన్ జూమ్ సపోర్ట్ తో వస్తుంది. ఈ గూగుల్ కొత్త ఫోన్ గుట్టల కొద్దీ కెమెరా ఫీచర్స్ మరియు మ్యాజిక్ ఎడిటర్, ఆటో ఫ్రేమ్ మరియు మ్యాజిక్ ఎరేజర్ వంటి చాలా ఎడిటింగ్ ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది.
Also Read: boAt Nirvana Crystal: 100 గంటల ప్లే టైం మరియు 32dB ANC తో బడ్జెట్ ధరలో వచ్చింది.!
పిక్సెల్ 9a అల్యుమినియం ఫ్రేమ్ తో మరియు సూపర్ బిల్డ్ తో వస్తుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ గా కూడా ఉంటుంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15OS తో వస్తుంది 7 మేజర్ OS అప్డేట్స్ వరకు అప్గ్రేడ్ అవుతుంది. ఈ ఫోన్ లో ఎమర్జెన్సీ SOS, క్రైసిస్ అలర్ట్, కార్ క్రాష్ డిటెక్షన్ మరియు థెఫ్ట్ ప్రొటెక్షన్ వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లో 5,100 mAh బిగ్ బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ మరియు Qi సర్టిఫైడ్ వైర్లెస్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా వుంది.