Google Pixel 9 Series: భారీ కెమెరా సెటప్ తో ఆగస్టు 14 న లాంచ్ కి సిద్ధం.!
Google Pixel 9 Series లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది
పిక్సెల్ 9 సిరీస్ నుండి ఈసారి ఫోల్డ్ ఫోన్ ను కూడా లాంచ్ తీసుకు వస్తుంది
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ ను AI శక్తితో తీసుకువస్తోంది
Google Pixel 9 Series: గూగుల్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ సిరీస్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ డేట్ ను అనౌన్స్ చేసింది. ఎప్పుడెప్పుడా అని గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ప్రియులు ఎదురు చూస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ సిరీస్ ఎట్టకేలకు విడుదల అవుతోంది. ఈ పిక్సెల్ 9 సిరీస్ నుంచి రెండు నుంచి మూడు ఫోన్ లను విడుదల చేస్తున్నట్లు కనిపిస్తోంది. ఇందులో, రెగ్యులర్ డిజైన్ ఫోన్ లతో పాటు ఒక ఫోల్డ్ స్మార్ట్ ఫోన్ కూడా వుంది.
Google Pixel 9 Series
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ లాంచ్ డేట్ ను గూగుల్ ప్రకటించింది. ఈ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్ లను ఆగస్టు 14 వ తేదీ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సిరీస్ కు ఒక ప్రత్యేకత వుంది. అదేమిటంటే, పిక్సెల్ 9 సిరీస్ నుండి ఈసారి ఫోల్డ్ ఫోన్ ను కూడా లాంచ్ తీసుకు వస్తుంది. అప్ కమింగ్ గూగుల్ పిక్సెల్ ఫోన్ సిరీస్ ఫోన్స్ లాంచ్ డేట్ మరియు వివరాలతో Flipkart కూడా టీజింగ్ మొదలు పెట్టింది.
గూగుల్ అప్ కమింగ్ పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లలో గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ ను AI శక్తితో తీసుకువస్తోంది. పిక్సెల్ 9 సిరీస్ ఫోన్లలో వెనుక పవర్ ఫుల్ కెమెరా సెటప్ ఉన్నట్లు కనిపిస్తోంది. గూగుల్ అప్ కమింగ్ ఫోల్డ్ ఫోన్ లో వెనుక ట్రిపుల్ రియర్ మరియు మెయిన్ స్క్రీన్ లో సింగల్ కెమెరా ఉన్నాయి. అలాగే, 9 సిరీస్ ఫోన్స్ లో వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్నట్లు టీజింగ్ ఇమేజ్ ల ద్వారా అర్థం అవుతోంది.
Also Read: Oppo K12x 5G: డామేజ్ ప్రూఫ్ ఆర్మోర్ బాడీ మరియు ప్రీమియం డిజైన్ తో లాంచ్ అవుతోంది.!
గూగుల్ పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ పెద్ద బెజెల్స్ మరియు రౌండ్ కార్నర్ లతో కనిపిస్తోంది. ఈ ఫోన్ మడత విప్పినప్పుడు చూడటానికి ఒక బుక్ మాదిరిగా కనిపిస్తుంది. అయితే, పిక్సెల్ 9 సిరీస్ నుంచి లాంచ్ చేయబోతున్న ఫోన్స్ యొక్క ఇతర ఫీచర్స్ ను ఇంకా వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ లాంచ్ కోసం ఇంకా సమయం ఉంది కాబట్టి, ఈ ఫోన్స్ యొక్క కీలకమైన ఫీచర్స్ ను వెల్లడించే అవకాశం వుంది.