Google Pixel 9 Pro సూపర్ 8K కెమెరా ఫోన్ ఫస్ట్ సేల్ అనౌన్స్ చేసిన గూగుల్.!

Updated on 14-Oct-2024
HIGHLIGHTS

Google Pixel 9 Pro స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ను గూగుల్ అనౌన్స్ చేసింది

ఈ పిక్సెల్ 9 ప్రో ను గూగుల్ గత నెల లాంచ్ చేసింది

ఈ ప్రీమియం ఫోన్ మొదటి సేల్ ను ఇప్పుడు అనౌన్స్ చేసింది

Google Pixel 9 Pro స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ను గూగుల్ అనౌన్స్ చేసింది. గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ నుంచి పిక్సెల్ 9, పిక్సెల్ 9 XL మరియు పిక్సెల్ 9 ప్రో ఫోల్డ్ ఫోన్ లతో పాటు ఈ పిక్సెల్ 9 ప్రో ను కూడా గూగుల్ గత నెల లాంచ్ చేసింది. అయితే, వీటిలో పిక్సెల్ 9 ప్రో ని మాత్రం ఇప్పటి వరకు సేల్ కి అందుబాటులోకి తీసుకు రాలేదు. అయితే, ఈ ప్రీమియం ఫోన్ మొదటి సేల్ ను ఇప్పుడు అనౌన్స్ చేసింది.

Google Pixel 9 Pro : సేల్ మరియు ప్రైస్

గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ అక్టోబర్ 17 నుంచి మొదలవుతుంది. Flipkart, Croma మరియు Reliance Digital స్టోర్స్ ను ను లభిస్తుంది. ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను రూ. 1,09,999 రూపాయల ధరతో గూగుల్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ పొర్చేలిన్, రోజ్ క్వార్ట్జ్, హాజెల్ మరియు ఒడిసియన్ అనే నాలుగు కలర్ లలో లభిస్తుంది.

Also Read: అమెజాన్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తున్న Samsung Galaxy S22 5G స్మార్ట్ ఫోన్.!

Google Pixel 9 Pro : ఫీచర్స్

గూగుల్ ఈ ఫోన్ ను ప్రీమియం ఫీచర్స్ తో లాంచ్ చేసింది, ఈ ఫోన్ 6.3 ఇంచెస్ Super Actua స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఇది 1-120Hz రిఫ్రెష్ రేట్, 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 రక్షణ కలిగిన 24 బిట్ LTPO OLED స్క్రీన్. ఈ ఫోన్ ను లేటెస్ట్ Google Tensor G4 మరియు Titan M2 security చిప్ సెట్ జత అందించింది. ఈ ఫోన్ 16GB హెవీ ర్యామ్ మరియు 256GB హెవీ ఇంటర్నల్ స్టోరేజ్ ను కూడా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ గూగుల్ యొక్క End-to-end security తో వస్తుంది మరియు ఇన్ బిల్ట్ Gemini AI తో జతగా వస్తుంది.

కెమెరా పరంగా, ఈ గూగుల్ లేటెస్ట్ ఫోన్ లో గొప్ప సెటప్ వుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్, 48MP అల్ట్రా వైడ్ మరియు 48MP టెలిఫోటో కెమెరా సెటప్ వుంది. అలాగే ఈ ఫోన్ లో ముందు 42MP డ్యూయల్ PD సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ తో 30 fps వద్ద 8K వీడియోలు మరియు 60 fps వద్ద 4K వీడియోలు షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ సెల్ఫీ కెమెరాతో కూడా 30/60 fps వద్ద 4K వీడియోలు షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ లో 4700mAh బ్యాటరీని ఫాస్ట్ వైర్డ్ మరియు ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ తో అందించింది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :