Google Pixel 9 Pro మరియు Pro XL లను భారీ ఫీచర్స్ తో విడుదల చేసిన గూగుల్.!

Google Pixel 9 Pro మరియు Pro XL లను భారీ ఫీచర్స్ తో విడుదల చేసిన గూగుల్.!
HIGHLIGHTS

Google Pixel 9 series నుంచి ఈరోజు మూడు కొత్త ఫోన్ లను విడుదల చేసింది గూగుల్

పిక్సెల్ 9 ప్రో మరియు పిక్సెల్ 9 ప్రో మ్యాక్స్ లను దాదాపు ఒకే విధమైన ఫీచర్స్ తో అందించింది

గూగుల్ లేటెస్ట్ చిప్ సెట్, AI పవర్ తో పిచ్చెక్కించే ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగుపెట్టాయి

Google Pixel 9 series నుంచి ఈరోజు మూడు కొత్త ఫోన్ లను విడుదల చేసింది గూగుల్. ఇందులో బేసిక్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 9 కాగా పిక్సెల్ 9 ప్రో మరియు పిక్సెల్ 9 ప్రో మ్యాక్స్ లను దాదాపు ఒకే విధమైన ఫీచర్స్ తో అందించింది. ఈ రెండు గూగుల్ కొత్త ఫోన్లు కూడా భారీ కెమెరా సెటప్, గూగుల్ లేటెస్ట్ చిప్ సెట్, AI పవర్ తో పిచ్చెక్కించే ఫీచర్స్ తో మార్కెట్ లో అడుగుపెట్టాయి. పిక్సెల్ 9 ప్రో మరియు పిక్సెల్ 9 ప్రో మ్యాక్స్ ఫోన్ ధర, ఫీచర్లు మరియు స్పెక్స్ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

Google Pixel 9 Pro మరియు Pro XL : ఫీచర్లు

గూగుల్ ఈ కొత్త ఫోన్ లను భారీ కెమెరా సెటప్ తో అందించింది. గూగుల్ పిక్సెల్ అంటేనే కెమెరా సెటప్ మరియు ఫీచర్స్ కి పెట్టింది పేరు. ఈ కొత్త ఫోన్ లను కూడా అదే రీతిలో గూగుల్ అందించింది. ఈ రెండు ఫోన్లు కూడా వెనుక ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ను కలిగి ఉంటాయి. ఈ సెటప్ లో 50MP వైడ్ + 48MP అల్ట్రా వైడ్ + 48MP టెలీఫోటో (5X ఆప్టికల్ జూమ్) కెమెరాలు ఉన్నాయి. అంతేకాదు, ఈ ఫోన్ లలో ముందు 48MP సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

ఈ ఫోన్ లో అందించి కెమెరా లో Add me మరియు Auto Frame in Magic Editor అనే కొత్త ఫీచర్స్ ను అందించింది. యాడ్ మీ ఫీచర్ తో ఫోటో క్లిక్ చేసిన తర్వాత కూడా కావాల్సిన వారిని క్లిక్ చేసి యాడ్ చేసే అవకాశం ఉంటుందని గూగుల్ చెబుతోంది. అలాగే, మ్యాజిక్ ఎడిటర్ లో యాడ్ అయిన కొత్త ఫీచర్ తో మల్టీ ఫుల్ ఫ్రేమ్ లతో అధిక రిజల్యూషన్ ఫోటోలు పొందవచ్చు. ఈ ఫోన్ తో 8K వీడియోలను 30 FPS వద్ద రికార్డ్ చేయవచ్చని గూగుల్ తెలిపింది.

Google Pixel 9 Pro and Google Pixel 9 Pro XL

ఈ రెండు ఫోన్లు కూడా కొత్త Tensor G4 చిప్ సెట్ తో పని చేస్తాయి. ఈ చిప్ సెట్ తో వచ్చే మొదటి ఫోన్ లు ఇవే మరియు Gemini Nano multimodality మొదటి చిప్ సెట్ కూడా ఇదే అని గూగుల్ ప్రకటించింది. ఈ చిప్ సెట్ Anti-malware మరియు anti-phishing ప్రొటెక్షన్ తో వస్తుంది. గూగుల్ ఫోటోలు మరియు మెసేజెస్ లో స్పామ్ ప్రొటెక్షన్ ను కూడా అందిస్తుంది. ఈ ఫోన్ ను 16GB ర్యామ్ మరియు 128 GB / 256 GB / 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లతో అందించింది.

ఇక ఈ రెండు ఫోన్లలో ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం విషయానికి వస్తే, ఈ రెండు ఫోన్స్ డిస్ప్లే సైజులో తేడా వుంది. పిక్సెల్ 9 ప్రో ఫోన్ 6.3 ఇంచ్ Super Actua display (LTPO) ని కలిగి వుంది. అయితే, పిక్సెల్ 9 ప్రో XL ఫోన్ 6.8 ఇంచ్ సూపర్ Actua display (LTPO) స్క్రీన్ ని కలిగి ఉంటుంది. పిక్సెల్ 9 ప్రో ఫోన్ 1280 x 2856 రిజల్యూషన్ తో వస్తే, పిక్సెల్ 9 ప్రో XL 1344 x 2992 రిజల్యూషన్ తో వస్తుంది. ఈ రెండు ఫోన్లు కూడా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తాయి.

Also Read: Google Pixel 9: సూపర్ కెమెరా మరియు గొప్ప సెక్యూరిటీ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!

ఈ ఫోన్ ఫోన్స్ బ్యాటరీ లలో కూడా మార్పులు ఉంటాయి. పిక్సెల్ ప్రో ఫోన్ 4700 mAh బ్యాటరీని 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు వైర్లెస్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. అయితే, పిక్సెల్ ప్రో XL ఫోన్ మాత్రం 5060 mAh బ్యాటరీ ని 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ మరియు వైర్లెస్ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి ఉంటుంది. అంతేకాదు, ఈ రెండు ఫోన్లు కూడా Satellite SOS మరియు Emergency SOS వంటి మరిన్ని సేఫ్టీ ఫీచర్స్ ను కలిగి ఉంటాయి.

Google Pixel 9 Pro : ధర

గూగుల్ పిక్సెల్ 9 ప్రో స్మార్ట్ ఫోన్ ను రూ. 1,09,999 రూపాయల ప్రారంభ ధరతో విడుదల చేసింది.

Google Pixel 9 Pro XL : ధర

గూగుల్ పిక్సెల్ 9 ప్రో XL స్మార్ట్ ఫోన్ ను రూ. 1,24,999 రూపాయల ప్రారంభ ధరలో విడుదల చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo