రూ. 10,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో మొదలైన Google Pixel 9 Pro Fold ఫస్ట్ సేల్.!

రూ. 10,000 భారీ డిస్కౌంట్ ఆఫర్ తో మొదలైన Google Pixel 9 Pro Fold ఫస్ట్ సేల్.!
HIGHLIGHTS

Google Pixel 9 Pro Fold స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ మొదలయ్యింది

రూ. 10,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ అందుకోవచ్చు

గూగుల్ ఈ ఫోల్డ్ ఫోన్ ప్రీమియం ఫీచర్ తో ప్రీమియం ధరలో వచ్చింది

Google Pixel 9 Pro Fold స్మార్ట్ ఫోన్ మొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలయ్యింది. భారీ ఫీచర్స్ మరియు స్పెక్స్ గూగుల్ తీసుకు వచ్చిన ఈ గూగుల్ ఫోల్డ్ ఫోన్ ను మొదటి సేల్ నుంచి రూ. 10,000 రూపాయల భారీ బ్యాంక్ డిస్కౌంట్ అఫర్ తో కూడా అందించింది.

Google Pixel 9 Pro Fold : ప్రైస్ మరియు ఆఫర్లు

గూగుల్ ఈ ఫోల్డ్ ఫోన్ ను ప్రీమియం ఫీచర్ తో ప్రీమియం ధరలో అందించడం జరిగింది. ఈ ఫోల్డ్ ఫోన్ ను రూ. 1,72,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ ను Flipkart నుంచి ICICI బ్యాంక్ క్రెడిట్ / డెబిట్ కార్డ్ మరియు EMI ఆప్షన్ తో కొనుగోలు చేసే యూజర్లు రూ. 10,000 తగ్గింపు అందుకుంటారు. ఈ ఫోన్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది మరియు ఈ ఫోన్ Flipkart, TATA Croma స్టోర్స్ మరియు Reliance Digital లలో లభిస్తుంది.

Google Pixel 9 Pro Fold : ఫీచర్స్

గూగుల్ ఈ ఫోన్ ను భారీ ఫీచర్స్ తో అందించడం జరిగింది. ఈ ఫోన్ లో 1800 నిట్స్ HDR బ్రైట్నెస్ సపోర్ట్ కలిగిన 6.2 ఇంచ్ OLED ఎక్స్ టర్నల్ స్క్రీన్ మరియు 1600 నిట్స్ HDR బ్రైట్నెస్ సపోర్ట్ కలిగిన 8 ఇంచ్ LTPO మెయిన్ స్క్రీన్ ఉన్నాయి. ఈ రెండు స్క్రీన్ లు కూడా HDR సపోర్ట్ కలిగిన 24 బిట్ ప్యానల్స్ మరియు సూపర్ బ్రైట్నెస్ కలర్స్ అందిస్తాయి.

Google Pixel 9 Pro Fold

ఈ గూగుల్ ఫోల్డ్ ఫోన్ Google Tensor G4 ప్రోసెసర్ మరియు Titan M2 security సహా ప్రోసెసర్ తో సూపర్ స్పీడ్ మరియు సెక్యూర్ గా ఉంటుందని గూగుల్ తెలిపింది. అంతేకాదు, ఈ ఫోన్ లో 16GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ సపోర్ట్ కూడా అందించింది.

Also Read: 10 వేల బడ్జెట్ లో రెండు కొత్త Smart Tv లు లాంచ్ చేసిన Daiwa బ్రాండ్.!

కెమెరా పరంగా, 48 MP Quad PD వైడ్ + 10.5 MP Dual PD అల`అల్ట్రా వైడ్ 10.8 MP డ్యూయల్ PD టెలిఫోటో కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. అలాగే, 10MP డ్యూయల్ PD ఇన్నర్ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ కెమెరా 20X సూపర్ రిజల్యూషన్ జూమ్, 4K విడియో రికార్డింగ్ ను 24/30/60 FPS వద్ద షూట్ చేసే సత్తా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లోని ఇన్నర్ కెమెరా కూడా 4K వీడియో లను 60fps వద్ద షూట్ చేయవచ్చు. ఈ ఫోన్ కెమెరాలో గుట్టల కొద్దీ ఫిల్టర్లు మరియు టన్నుల కొద్దీ AI ఫీచర్స్ ఉన్నాయి.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo