Google Pixel 9: సూపర్ కెమెరా మరియు గొప్ప సెక్యూరిటీ ఫీచర్స్ తో లాంచ్ అయ్యింది.!
గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ను ఈరోజు గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది
Google Pixel 9 ను సూపర్ కెమెరా మరియు గొప్ప సెక్యూరిటీ ఫీచర్స్ తో లాంచ్ చేసింది
ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు కలర్ లలో అందించింది
Google Pixel 9 : గూగుల్ పిక్సెల్ 9 సిరీస్ ను ఈరోజు గూగుల్ ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేసింది. ఈ సిరీస్ నుంచి బేసిక్ వేరియంట్ వేరియంట్ అయిన గూగుల్ పిక్సెల్ 9 ను సూపర్ కెమెరా మరియు గొప్ప సెక్యూరిటీ ఫీచర్స్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ను సరికొత్త డిజైన్ మరియు కలర్ లలో అందించింది. పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ ఈ ధరలో సాటిలేని సెక్యూరిటీ మరియు కెమెరా సెట్ తో వచ్చింది.
Google Pixel 9 : ఫీచర్లు
గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ ను 6.3 ఇంచ్ Actua స్క్రీన్ తో ప్రవేశపెట్టింది. ఈ స్క్రీన్ 1080 x 2424 రిజల్యూషన్, 60 – 120 Hz రిఫ్రెష్ రేట్ మరియు 2700 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ను కలిగి ఉంటుంది. అంతేకాదు, అత్యంత పటిష్టమైన గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఈ ఫోన్ స్క్రీన్ కలిగి వుంది.
గూగుల్ ఈ ఫోన్ ను గూగుల్ Tensor G4 చిప్ సెట్ మరియు Titan M2 security సెక్యూరిటీ ప్రోసెసర్ తో అందించింది. ఈ ఫోన్ 12GB ర్యామ్ మరియు 128GB / 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్ లతో కలిగి ఉంటుంది. సెక్యూరిటీ పరంగా Google VPN, ఎండ్ టు ఎండ్ సెక్యూరిటీ మరియు మల్టీ లేయర్ హార్డ్ వేర్ వంటి మరిన్ని సెక్యూరిటీ ఫీచర్స్ ను కూడా కలిగి ఉంటుంది.
గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ వెనుక డ్యూయల్ రియర్ కెమెరా వుంది. ఇందులో 50MP Octa PD వైడ్ + 48MP Quad PD అల్ట్రా వైడ్ కెమెరా లను కలిగి వుంది. ఈ ఫోన్ ముందు భాగంలో 10.5MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ 8x సూపర్ రిజల్యూషన్ జూమ్, Magic Editor, Magic Editor మరియు Photo Unblur వంటి అనేకమైన సూపర్ కెమెరా ఫీచర్ లను కూడా కలిగి వుంది.
ఈ ఫోన్ కెమెరాతో 4K వీడియో లను 24/30/60 FPS వద్ద రికార్డ్ చేయవచ్చని గూగుల్ తెలిపింది. ఇది కాకుండా 10-bit HDR వీడియో, సినీ మెటిక్ బ్లర్, సినీ మెటిక్ పేన్ 4K టైమ్ ల్యాప్స్ వీడియో లను కూడా షూట్ చేయవచ్చు.
ఈ ఫోన్ IP68 రేటింగ్ తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్ తో వస్తుంది. ఈ ఫోన్ 4700 mAh బ్యాటరీని 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది. ఈ ఫోన్ లో స్పెటియల్ ఆడియో, నోయిస్ సస్పెషన్, Satellite SOS, Emergency SOS మరియు కార్ క్రాష్ డిటెక్షన్ వంటి చాలా ఫీచర్స్ ను కలిగి వుంది.
Also Read: Flipkart Sale: భారీ ఆఫర్ LED రేటుకే 4K QLED Smart Tv ఆఫర్ చేస్తున్న ఫ్లిప్ కార్ట్.!
Google Pixel 9 : ధర
గూగుల్ పిక్సెల్ 9 స్మార్ట్ ఫోన్ 8GB + 128GB ర్యామ్ బేసిక్ వేరియంట్ ను రూ. 79,999 ధరతో విడుదల చేసింది. ఈ ఫోన్ అబ్సిడియన్, పోర్స్లేన్, వింటర్ గ్రీన్ మరియు ప్యూని నాలుగు కలర్ లలో అందించింది.