Google Pixel 8a: Google AI పవర్ తో వచ్చిన గూగుల్ ఫోన్.!
గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ నుంచి కొత్త ఫోన్ ను లాంచ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది గూగుల్
Google Pixel 8aను Google AI పవర్ Gemini AI ఇన్ బిల్ట్ గా అందించింది
ఈ కొత్త ఫోన్ ను మరిన్ని కెమెరా ప్రత్యేకతలతో గూగుల్ తీసుకు వచ్చింది
Google Pixel 8a: గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ నుంచి కొత్త ఫోన్ ను లాంచ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చింది గూగుల్. ఈ కొత్త స్మార్ట్ ఫోన్ ను Google AI పవర్ Gemini AI ఇన్ బిల్ట్ గా అందించిన అందిరిని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, ఈ ఫోన్ తో పాటు భారీ లాంచ్ ఆఫర్స్ మరియు డీల్స్ ను కూడా అందించింది. భారత్ మార్కెట్ లో ఈ రోజు సరికొత్తగా అడుగు పెట్టిన గూగుల్ కొత్త ఫోన్ స్పెక్స్, ఫీచర్స్ మరియు ప్రైస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి.
Google Pixel 8a: Price
గూగుల్ ఈ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను రూ. 52,999 ప్రారంభ ధరతో విడుదల చేసింది. ఈ ప్రైస్ ట్యాగ్ తో 8GB + 128GB వేరియంట్ ను అందించింది. గూగుల్ పిక్సెల్ 8ఎ యొక్క 8GB + 256GB వేరియంట్ ను రూ. 59,999 ప్రైస్ తో అందించింది. ఈ ఫోన్ ఈరోజు నుండి Flipkart ద్వారా Pre Orders కి అందుబాటులోకి కూడా వచ్చింది.
ఆఫర్లు
గూగుల్ పిక్సెల్ 8ఎ స్మార్ట్ ఫోన్ పైన గొప్ప లాంచ్ ఆఫర్లను అందించింది. రూ. 9,999 రూపాయల విలువైన గూగుల్ పిక్సెల్ బడ్స్ A-సిరీస్ ను ఈ ఫోన్ తో జతగా తీసుకుంటే కేవలం రూ. 999 కె అందుతాయి. అంటే, ఈ ఫోన్ రూ. 9,000 రూపాయల ప్రయోజనాన్ని అందించినట్లు అవుతుంది.
ఇది కాకుండా, ఈ ఫోన్ పైన SBI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ మరియు EMI పైన రూ. 4,000 ప్లాట్ డిస్కౌంట్ ను కూడా అందించింది. అంతేకాదు, ఈ ఫోన్ పైన రూ. 9,000 రూపాయల వరకూ అదనపు ఎక్స్ చేంజ్ బోనస్ ను ఆఫర్ ను కూడా అందించింది. ఈ ఆఫర్లతో గూగుల్ పిక్సెల్ 8ఎ ఫోన్ ను రూ. 39,999 రూపాయల డిస్కౌంట్ ధరకే అందుకోవచ్చని తెలిపింది.
అయితే, ఈ పైన తెలిపిన ఆఫర్స్ అన్ని కూడా కేవలం ‘Limited Period Offer’ అని మాత్రమే తెలిపింది.
Also Read: ఇండియన్ టెక్ బ్రాండ్ నుండి పెద్ద Luxury AMOLED డిస్ప్లే స్మార్ట్ వాచ్ లాంచ్.!
Google Pixel 8a: ఫీచర్లు
గూగుల్ పిక్సెల్ 8ఎ పిక్సెల్ A-Series లో అత్యంత కఠినమైన ఫోన్ అవుతుందని గూగుల్ తెలిపింది. ఈ ఫోన్ IP67 రేటింగ్ తో వస్తుంది మరియు వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ ఇన్ బిల్ట్ Google AI తో వస్తుంది ask Gemini ఫీచర్ తో అన్ని పనులు జస్ట్ వాయిస్ కమాండ్ తో చక్క పెట్టవచ్చని తెలిపింది.
గూగుల్ పిక్సెల్ ఫోన్ అంటేనే కెమెరా ప్రత్యేకతలకు పెట్టింది పేరు. ఈ కొత్త ఫోన్ ను మరిన్ని కెమెరా ప్రత్యేకతలతో గూగుల్ తీసుకు వచ్చింది. ఈ ఫోన్ లో వెనుక 64MP + 13MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరాతో అందించింది.
ఈ కెమెరాతో Magic Editor, Best Take, Magic Eraser, Photo Unblur, Real Tone, Face Unblur మరియు Live HDR+, Ultra HDR వంటి గుట్టల కొద్దీ ఫీచర్స్ ను అందించింది. ఈ ఫోన్ ఫ్రెంట్ మరియు బ్యాక్ కెమెరాతో కూడా 4K వీడియో లను షూట్ చేయవచ్చు. అంతేకాదు, మ్యాజిక్ ఎడిటర్ ద్వారా ఫోటోలను రియల్ టైం లో ఎడిట్ చేసి అద్భుతంగా మార్చుకోవచ్చు.
ఈ గూగుల్ ఫోన్ ఫోన్ 6.1 ఇంచ్ FHD+ 24 Bit డిస్ప్లే ని 1400 నిట్స్ (HDR) బ్రైట్నెస్ లేదా 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో కలిగి వుంది. పిక్సెల్ 8ఎ ఫోన్ గూగుల్ యొక్క లేటెస్ట్ Tensor G3 ప్రోసెసర్ మరియు Android 14 OS తో వస్తుంది. ఈ ఫోన్ 7 సంవత్సరాల వరకు OS మరియు సెక్యూరిటీ అప్డేట్స్ ను అందుకుంటుది. ఈ ఫోన్ సెక్యూరిటీ మరింత పటిష్టంగా ఉండడానికి వీలుగా Titan M2 చి సెట్ ను కూడా అందించింది.
చివరిగా, ఈ ఫోన్ బ్యాటరీ మరియు ఛార్జ్ విషయానికి వస్తే, ఈ ఫోన్ లో 4,400 mAh బ్యాటరీ ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో కలిగి వుంది.