Google Pixel 8a: భారీ ఆఫర్లతో గూగుల్ కొత్త ఫోన్ ఫస్ట్ సేల్.!
Google Pixel 8a స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది
ఈ ఫోన్ ఇప్పటి వరకు కేవలం Pre Orders కి మాత్రమే అందుబాటులో వుంది
ఈ గూగుల్ ఫోన్ ఇన్ బిల్ట్ Google AI టెక్నాలజీ ask Gemini ఫీచర్ తో వస్తుంది
Google Pixel 8a: గూగుల్ లేటెస్ట్ గా విడుదల చేసిన గూగుల్ పిక్సెల్ 8ఎ స్మార్ట్ ఫోన్ ఫస్ట్ సేల్ ఈరోజు నుంచి మొదలయ్యింది. ఈ ఫోన్ ఇప్పటి వరకు కేవలం Pre Orders కి మాత్రమే అందుబాటులో వుంది. అయితే, ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల నుండి సేల్ కి అందులోకి వచ్చింది. మొదటి సేల్ నుండి ఈ ఫోన్ పాకిన భారీ ఆఫర్లు కూడా తీసుకు వచ్చింది.
Google Pixel 8a: Price & Offers
గూగుల్ పిక్సెల్ 8 ఎ స్మార్ట్ ఫోన్ ను రూ. 52,999 రూపాయల ధరతో గూగుల్ లాంచ్ చేసింది. ఈ ఫోన్ యొక్క 8GB + 128GB వేరియంట్ ఈ ధరకు లభిస్తుంది. ఈ ఫోన్ యొక్క 8GB + 256GB వేరియంట్ ను రూ. 59,999 ధరతో విడుదల చేసింది.
ఈ ఫోన్ పైన భారీ లాంచ్ ఆఫర్లు కూడా గూగుల్ అందించింది. ఈ ఫోన్ ICICI Credit Non EMI, Credit and Debit Card EMI లతో కొనే వారికి రూ. 4,000 రూపాయల అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. ఇది కాకుండా, ఈ ఫోన్ ఎక్స్ చేంజ్ పైన రూ. 9,000 రూపాయల తగ్గింపు కూడా లభిస్తుంది.
ఈ ఆఫర్లతో ఈ ఫోన్ ను రూ. 39,999 రూపాయలకే అందుకోవచ్చని గూగుల్ తెలిపింది. ఈ ఫోన్ ను Flipkart నుండి కొనుగోలు చేయవచ్చు. అయితే, ప్రీ ఆర్డర్స్ తో అందించే కొన్ని ఆఫర్లు మాత్రం ఈరోజు క్లోజ్ అవుతాయి.
Google Pixel 8a: స్పెక్స్
ఈ గూగుల్ ఫోన్ ఇన్ బిల్ట్ Google AI టెక్నాలజీ ask Gemini ఫీచర్ తో వస్తుంది. ఈ ఫీచర్ తో వచ్చిన గూగుల్ మొదటి ఫోన్ కూడా ఇదే అవుతుంది. ఈ గూగుల్ ఫోన్ లో 24 Bit 6.1 ఇంచ్ FHD+ రిజల్యూషన్ డిస్ప్లే వుంది. ఇది 1400 నిట్స్ (HDR) బ్రైట్నెస్ లేదా 2000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ తో వస్తుంది. పిక్సెల్ 8ఎ స్మార్ట్ ఫోన్ Tensor G3 ప్రోసెసర్ కి జతగా 8GB LPDDR5x RAM మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ తో వస్తుంది.
గూగుల్ పిక్సెల్ ఫోన్ కెమెరా ఎప్పడూ ప్రత్యేకంగానే ఉంటుంది. ఈ ఫోన్ లో అందించిన కెమెరా మరిన్ని ఫీచర్స్ మరియు ప్రత్యేకతలతో ఉంటుంది. ఈ ఫోన్ లో 64MP + 13MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు 13MP సెల్ఫీ కెమెరా వున్నాయి.
Also Read: Dolby Atmos మరియు BOSE సర్టిఫికేషన్ తో వచ్చిన Moto Buds+ సేల్ ఎప్పుడంటే.!
ఈ కెమెరా Magic Editor, Best Take, Magic Eraser, Photo Unblur, Real Tone,Live HDR+ మరియు Ultra HDR వంటి మరిన్ని కెమెరా ఫీచర్ లను కలిగి వుంది. ఈ ఫోన్ కెమెరాతో 4K వీడియోలను 30 fps మరియు 60 fps వద్ద కూడా షూట్ చేయవచ్చని కంపెనీ తెలిపింది.
ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ Android 14 OS తో వస్తుంది మరియు 7 Years of Security మరియు OS అప్గ్రేడ్ లను అందిస్తుందని కూడా గూగుల్ తెలిపింది.