Google Pixel 8a పై ఫ్లిప్ కార్ట్ సూపర్ వాల్యూ డేస్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్.!

Updated on 17-Dec-2024
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ సూపర్ వాల్యూ డేస్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్

గూగుల్ జబర్దస్త్ స్మార్ట్ ఫోన్ Google Pixel 8a ఈరోజు బడ్జెట్ ధరకే లభిస్తుంది

ఈ గూగుల్ ఫోన్ ను ఈరోజు మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు

Google Pixel 8a స్మార్ట్ ఫోన్ పై ఫ్లిప్ కార్ట్ సూపర్ వాల్యూ డేస్ సేల్ భారీ డిస్కౌంట్ ఆఫర్ అందించింది. ఫ్లిప్ కార్ట్ సరికొత్తగా ప్రకటించిన ఈ సేల్ నుంచి గూగుల్ జబర్దస్త్ స్మార్ట్ ఫోన్ ఈరోజు బడ్జెట్ ధరకే లభిస్తుంది. Google AI, Pixel డ్యూయల్ Camera మరియు Tensor G3 చిప్ సెట్ కలిగిన ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు మంచి ఆఫర్ ధరకే అందుకోవచ్చు.

Google Pixel 8a : ఆఫర్ ప్రైస్

గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 52,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ రోజు ఫ్లిప్ కార్ట్ సూపర్ వాల్యూ డేస్ సేల్ నుంచి రూ. 16,000 భారీ డిస్కౌంట్ తో రూ. 36,999 ఆఫర్ ధరకే లభిస్తోంది.

ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే వారికి ఈ అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి ఈ ఆఫర్స్ తో రూ. 34,999 రూపాయల ఆఫర్ ధరకు మీ సొంతం చేసుకోవచ్చు.

Google Pixel 8a : ఫీచర్స్

గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ 24 Bit స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD+ రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 2,000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు HDR సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ Tensor G3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది.

ఈ ఫోన్ లో వెనుక డ్యూయల్ కెమెరా సెటప్ వుంది. ఇందులో 64MP మెయిన్ కెమెరా మరియు 13MP రెండవ కెమెరా ఉన్నాయి. అలాగే, ఈ ఫోన్ లో ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ ఫోన్ లోని మెయిన్ మరియు సెల్ఫీ కెమెరాతో కూడా 4K వీడియోలు షూట్ చేయవచ్చు.

Also Read: ఇంటిని షేక్ చేసే LG 600W పవర్ ఫుల్ Dolby Soundbar పై బిగ్ డీల్.!

ఈ ఫోన్ మెయిన్ కెమెరాతో 4K వీడియోలు 60fps వద్ద షూట్ చేయవచ్చు. గూగుల్ పిక్సెల్ ఫోన్ అంటే కెమెరాకి పెట్టింది పేరు. ఈ ఫోన్ లో అనేక కెమెరా ఎడిటింగ్ ఆప్షన్ లు కూడా ఉంటాయి. ఈ ఫోన్ లో Android 14 OS తో వస్తుంది మరియు 6 సంవత్సరాల సెక్యూరిటీ అప్డేట్స్ కి హామీ ఇస్తుంది. ఈ ఫోన్ IP67 రేటింగ్ తో వస్తుంది మరియు ఫాస్ట్ వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :