గూగుల్ అప్ కమింగ్ స్మార్ట్ ఫోన్స్ Google Pixel 8 మరియు Google Pixel 8 Pro గురించి కొత్త వివరాలు ఇప్పుడు నెట్టింట్లో చెక్కర్లు కొడుతున్నాయి. ఈ Google Pixel 8 మరియు Google Pixel 8 Pro రెండు ఫోన్ల ఇండియా లాంచ్ డేట్, ఎక్స్ పెక్టడ్ ధర మరియు ఫీచర్లును ఒక కొత్త నివేదిక వెల్లడించింది. ఈ నివేదికలో ఈ ఫోన్స్ గురించి కొత్త నివేదిక అందించిన వివరాలు ఏమిటో తెలుసుకోండి.
Google Pixel 8 మరియు Google Pixel 8 Pro లాంచ్ తో పాటుగా ఎక్స్ పెక్టడ్ ప్రైస్ మరియు మరిన్ని వివరాలను గురించి వివరిస్తూ The Tech Outlook ముందుగా నివేదిక అందించింది. ఈ రిపోర్ట్ ప్రకారం, గూగుల్ పిక్సెల్ 8 స్మార్ట్ ఫోన్ యూరోపియన్ మార్కెట్ లో EUR 874 ప్రైస్ ట్యాగ్ లాంచ్ చేయవచ్చని తెలిపింది. అయితే, LiveMint కొత్త నివేదికలో ఇండియన్ మార్కెట్ లో దీని కంటే తక్కువ ధరలో దాదాపుగా రూ. 60,000 దరిదాపుల్లో ఈ ఫోన్ ధర వచ్చని తెలిపింది మరియు Pixel 8 Pro ధర అంతకు మించి ఉండవచ్చు. ఈ ఫోన్ లు గూగుల్ పవర్ ఫుల్ చిప్ సెట్ Tensor 3 తో వస్తావని కొత్త లీక్స్ చెబుతున్నాయి.
ఇక ఇప్పటికే నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న రూమర్స్ ద్వారా Pixel 8 స్మార్ట్ ఫోన్ 6.17 ఇంచ్ AMOLED డిస్ప్లేని 120Hz రిఫ్రెష్ రేట్ తో కలిగి ఉంటుంది. ఈ గూగుల్ ఫోన్ లో 50 MP ప్రధాన కెమేరా, 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ మరియు ఒక ToF (టైమ్ ఆఫ్ ఫ్లైట్) సెన్సార్ ఉంటాయి. ఈ ఫోన్ కెమేరా చాలా శక్తివంతమైనదిగా మరియు 8K వీడియోలను కూడా చిత్రీకరించే విధంగా ఉంటుందని కూడా రూమర్స్ ఉన్నాయి.
ఇక Google Pixel 8 Specs విషయానికి వస్తే ఈ ఫోన్ లో డిస్ప్లే మొదలుకొని కెమేరా వరకూ అన్నీ ప్రీమియం ఫీచర్స్ ఉండవచ్చని రూమర్స్ చెబుతున్నాయి. ఈ Pixel 8 Pro ఫోన్ లో పెద్ద 6.7 ఇంచ్ OLED డిస్ప్లేని QHD రిజల్యూషన్ తో అందించవచ్చని నెట్టింట రూమర్స్ ఉన్నాయి. ఈసారి గూగుల్ ఫోన్ లో పెద్ద కెమేరా మరియు టన్నుల కొద్దీ కొత్త ఫీచర్స్ మరియు ఫిల్టర్స్ ని కూడా గూగుల్ జత చేయవచ్చని రూమర్స్ కూడా ఉన్నాయి.
ఇందులో వాస్తవాలు ఎన్ని ఉన్నాయి అనేది అక్టోబర్ 4న Google Pixel 8 Series ఫోన్స్ లాంచ్ అయిన తరువాత మాత్రమే తెలుస్తుంది.