Google I/O 2023 నుండి గూగుల్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Google Pixel 7a ను రిలీజ్ చేసింది. ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ ఈసారి 64MP బిగ్ ప్రైమరీ కెమేరాతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో సేల్ కి అంధుబౌట్లోకి వచ్చింది మరియు ఈ ఫోన్ ను Flipkart ద్వారా బెస్ట్ డీల్స్ మరియు బ్యాంక్ ఆఫర్లతో గూగుల్ సేల్ కి అందులోకి తెచ్చింది. ఈ లేటెస్ట్ గూగుల్ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన వివరాలు ఇక్కడ ఉన్నాయి.
గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ ని రూ. 43,999 ధరతో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన భారీ ఆఫర్లను కూడా గూగుల్ అందించింది. ఈ గూగుల్ ఫోన్ ను HDFC బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ తో కొనే యూజర్లు రూ. 4,000 భారీ డిస్కౌంట్ పొందుతారు. అలాగే, ఈ ఫోన్ తో రూ. 7,999 విలువైన Fitbit Inspire 2 ని రూ. 3,999 కి మరియు రూ. 7,999 విలువైన Google Pixel Buds A-Series బడ్స్ ని రూ. 3,999 కి అఫర్ ధరకే అందుకోవచ్చు. అంటే, ఇక్కడ కూడా దాదాపుగా రూ. 8,000 రూపాయల ప్రయోజనాలను పొందవచ్చు.
గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన 6.1 ఇంచ్ FHD+ OLED డిస్ప్లేని కలిగి వుంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఉంటుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ ను గూగుల్ Google Tensor G2 ప్రోసెసర్ మరియు Titan M2 సెక్యూరిటీ సహా ప్రోసెసర్ తో అందించింది. దినికి పిక్సెల్ 7a ఫోన్ 8GB LPDDR5 ర్యామ్ 128GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ తో కలిగి వుంది.
ఈ ఫోన్ లో 64MP (OIS) క్వాడ్ బేయర్ వైడ్ కెమేరాకి జతగా 13MP అల్ట్రా వైడ్ కెమేరాతో అందించింది. ఈ కెమేరా సిస్టం OIS మరియు EIS సపోర్ట్ తో పాటుగా డ్యూయల్ పిక్సెల్ ఫేజ్ డిటక్షన్ ని ఆటో ఫోకస్ తో కలిగి వుంది. ఈ ఫోన్ తో 30 fps మరియు 60 fps వద్ద కూడా 4K వీడియోలను షూట్ చెయ్యవచ్చని గూగుల్ తెలిపింది. ఈ ఫోన్ లో 13MP సెల్ఫీ కెమేరాని f/2.2 ఎపర్చర్ తో అందించింది.
ఈ ఫోన్ 5 సంవత్సరాల పిక్సెల్ అప్డేట్స్ ను అందుకుంటుందని గూగుల్ తెలిపింది. ఈ ఫోన్ 4300 mAh బ్యాటరీని ఫాస్ట్ మరియు వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో జత చేసింది.