Google Pixel 7a: ఈసారి భారీ 64MP కెమేరాతో వచ్చిన గూగుల్ ఫోన్.!

Google Pixel 7a: ఈసారి భారీ 64MP కెమేరాతో వచ్చిన గూగుల్ ఫోన్.!
HIGHLIGHTS

Google I/O 2023 నుండి గూగుల్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Google Pixel 7a ను రిలీజ్ చేసింది

ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ ఈసారి 64MP బిగ్ ప్రైమరీ కెమేరాతో లాంచ్ అయ్యింది

Flipkart ద్వారా బెస్ట్ డీల్స్ మరియు బ్యాంక్ ఆఫర్లతో గూగుల్ సేల్ కి అందులోకి తెచ్చింది

Google I/O 2023 నుండి గూగుల్ యొక్క లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Google Pixel 7a ను రిలీజ్ చేసింది. ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ ఈసారి 64MP బిగ్ ప్రైమరీ కెమేరాతో లాంచ్ అయ్యింది. ఈ స్మార్ట్ ఫోన్ ఇండియాలో సేల్ కి అంధుబౌట్లోకి వచ్చింది మరియు ఈ ఫోన్ ను Flipkart ద్వారా బెస్ట్ డీల్స్ మరియు బ్యాంక్ ఆఫర్లతో గూగుల్ సేల్ కి అందులోకి తెచ్చింది. ఈ లేటెస్ట్ గూగుల్ స్మార్ట్ ఫోన్ గురించి మీరు తెలుసుకోవాల్సిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. 

Google Pixel 7a: ధర & ఆఫర్లు

గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ ని రూ. 43,999 ధరతో ఇండియన్ మార్కెట్ లో విడుదల చేసింది. ఈ స్మార్ట్ ఫోన్ పైన భారీ ఆఫర్లను కూడా గూగుల్ అందించింది.  ఈ గూగుల్ ఫోన్ ను HDFC బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డ్ తో కొనే యూజర్లు రూ. 4,000 భారీ డిస్కౌంట్ పొందుతారు. అలాగే, ఈ ఫోన్ తో రూ. 7,999 విలువైన Fitbit Inspire 2 ని రూ. 3,999 కి మరియు రూ. 7,999 విలువైన Google Pixel Buds A-Series బడ్స్ ని రూ. 3,999 కి అఫర్ ధరకే అందుకోవచ్చు. అంటే, ఇక్కడ కూడా దాదాపుగా రూ. 8,000 రూపాయల ప్రయోజనాలను పొందవచ్చు. 

Google Pixel 7a: ప్రత్యేకతలు 

గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ కలిగిన 6.1 ఇంచ్ FHD+ OLED డిస్ప్లేని కలిగి వుంది. ఇది ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో ఉంటుంది మరియు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటక్షన్ తో వస్తుంది. ఈ ఫోన్ ను గూగుల్ Google Tensor G2 ప్రోసెసర్ మరియు Titan M2 సెక్యూరిటీ సహా ప్రోసెసర్ తో అందించింది. దినికి పిక్సెల్ 7a ఫోన్ 8GB LPDDR5 ర్యామ్ 128GB UFS 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ తో కలిగి వుంది. 

ఈ ఫోన్ లో 64MP (OIS) క్వాడ్ బేయర్ వైడ్ కెమేరాకి జతగా 13MP అల్ట్రా వైడ్ కెమేరాతో అందించింది. ఈ కెమేరా సిస్టం OIS మరియు EIS సపోర్ట్ తో పాటుగా డ్యూయల్ పిక్సెల్ ఫేజ్ డిటక్షన్ ని ఆటో ఫోకస్ తో కలిగి వుంది. ఈ ఫోన్ తో 30 fps మరియు 60 fps వద్ద కూడా 4K వీడియోలను షూట్ చెయ్యవచ్చని గూగుల్ తెలిపింది. ఈ ఫోన్ లో 13MP సెల్ఫీ కెమేరాని f/2.2 ఎపర్చర్ తో అందించింది. 

ఈ ఫోన్ 5 సంవత్సరాల పిక్సెల్ అప్డేట్స్ ను అందుకుంటుందని గూగుల్ తెలిపింది. ఈ ఫోన్ 4300 mAh బ్యాటరీని ఫాస్ట్ మరియు వైర్ లెస్ ఛార్జింగ్ సపోర్ట్ తో  జత చేసింది.

Raja Pullagura

Raja Pullagura

Crazy about tech...Cool in nature... View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo