Google Pixel 7a స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ అందించింది Monumental Sale నుంచి ఈ ధమాకా ఆఫర్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి సగం ధరకే ఆఫర్ చేస్తోంది. ఇండియాలో ప్రీమియం సెగ్మెంట్ లో విడుదలైన ఈ గూగుల్ ఫోన్ ను ఈరోజు కేవలం 25 వేలకే అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.
గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 36% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ అందించింది.
ఈ ఫోన్ ఇండియాలో రూ. 43,999 రూపాయల MRP ప్రైస్ మరియు రూ. 39,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ అందిస్తున్న ఈ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో కలిపి కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. అలాగే, గూగుల్ పిక్సెల్ ను కూడా అన్ని ఆఫర్స్ తో కలిపి రూ. 26,999 ధరకే అందుకునే అవకాశం అందించింది.
Also Read: Sankranti Super Deal: ఎన్నడూ లేనంత చవక ధరకు లభిస్తున్న LG Dolby Atmos 3.1.2 సౌండ్ బార్.!
గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ Google Tensor G2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ (Nano + eSIM) డ్యూయల్ సిం సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 6.3 ఇంచ్ FHD= రిజల్యూషన్ OLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR సపోర్ట్ మరియు గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది.
ఈ గూగుల్ ఫోన్ 50MP Octa PD క్వాడ్ బేయర్ వైడ్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు ముందు 10.8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్ మరియు సెల్ఫీ కెమెరాతో 30 fps/60 fps వద్ద 4K Video లను షూట్ చేయవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరా Magic Eraser వంటి అనేకమైన గూగుల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4270 mAh బ్యాటరీ మరియు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.