Google Pixel 7a: సగం ధరకే లభిస్తున్న గూగుల్ లేటెస్ట్ 5G ఫోన్.!
Google Pixel 7a స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తుంది
ఫ్లిప్ కార్ట్ Monumental Sale నుంచి ఈ ధమాకా ఆఫర్ అందించింది
ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి సగం ధరకే ఆఫర్ చేస్తోంది
Google Pixel 7a స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి సగం ధరకే లభిస్తుంది. రిపబ్లిక్ డే సందర్భంగా ఫ్లిప్ కార్ట్ అందించింది Monumental Sale నుంచి ఈ ధమాకా ఆఫర్ అందించింది. ఫ్లిప్ కార్ట్ ఈ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు అన్ని ఆఫర్స్ తో కలిపి సగం ధరకే ఆఫర్ చేస్తోంది. ఇండియాలో ప్రీమియం సెగ్మెంట్ లో విడుదలైన ఈ గూగుల్ ఫోన్ ను ఈరోజు కేవలం 25 వేలకే అందుకునే అవకాశం ఫ్లిప్ కార్ట్ అందించింది.
Google Pixel 7a: ఆఫర్
గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి 36% భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 27,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ పై రూ. 3,000 రూపాయల HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ అందించింది.
ఈ ఫోన్ ఇండియాలో రూ. 43,999 రూపాయల MRP ప్రైస్ మరియు రూ. 39,999 ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ అందిస్తున్న ఈ డిస్కౌంట్ మరియు బ్యాంక్ ఆఫర్ తో కలిపి కేవలం రూ. 24,999 రూపాయల ఆఫర్ ధరకే లభిస్తుంది. అలాగే, గూగుల్ పిక్సెల్ ను కూడా అన్ని ఆఫర్స్ తో కలిపి రూ. 26,999 ధరకే అందుకునే అవకాశం అందించింది.
Also Read: Sankranti Super Deal: ఎన్నడూ లేనంత చవక ధరకు లభిస్తున్న LG Dolby Atmos 3.1.2 సౌండ్ బార్.!
Google Pixel 7a: ఫీచర్స్
గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ Google Tensor G2 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ (Nano + eSIM) డ్యూయల్ సిం సపోర్ట్ తో వస్తుంది. ఈ ఫోన్ లో 6.3 ఇంచ్ FHD= రిజల్యూషన్ OLED స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ HDR సపోర్ట్ మరియు గొరిల్లా గ్లాస్ 3 రక్షణతో వస్తుంది.
ఈ గూగుల్ ఫోన్ 50MP Octa PD క్వాడ్ బేయర్ వైడ్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సపోర్ట్ కలిగి ఉంటుంది మరియు ముందు 10.8MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ మెయిన్ మరియు సెల్ఫీ కెమెరాతో 30 fps/60 fps వద్ద 4K Video లను షూట్ చేయవచ్చు. అంతేకాదు, ఈ ఫోన్ కెమెరా Magic Eraser వంటి అనేకమైన గూగుల్ కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4270 mAh బ్యాటరీ మరియు వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.