Google Pixel 7a పై ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి రూ. 16,000 భారీ డిస్కౌంట్ అందుకోండి.!
Google Pixel 7a భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది
ఫ్లిప్ కార్ట్ సూపర్ వాల్యూ డేస్ సేల్ నుంచి ఈ డీల్ ను అందించింది
రూ. 16,000 భారీ డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ కూడా పొందవచ్చు
Google Pixel 7a స్మార్ట్ ఫోన్ ఈరోజు ఫ్లిప్ కార్ట్ సూపర్ వాల్యూ డేస్ సేల్ నుంచి భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. సూపర్ కెమెరా ఫోన్స్ గా పేరున్న గూగుల్ పిక్సెల్ లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను ఈరోజు రూ. 16,000 రూపాయల భారీ డిస్కౌంట్ మరియు అదనపు బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో కూడా లభిస్తుంది. గూగుల్ పిక్సెల్ ఫోన్ ను 30 వేల కంటే తక్కువ ధరలో కొనాలని చూస్తున్న వారు ఈరోజు లభిస్తున్న ఈ డీల్ ను పరిశీలించవచ్చు.
Google Pixel 7a : ఆఫర్
గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ ఇండియాలో రూ. 43,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయ్యింది. ఈ గూగుల్ స్మార్ట్ ఫోన్ రోజు ఫ్లిప్ కార్ట్ సూపర్ వాల్యూ డేస్ సేల్ నుంచి రూ. 16,000 భారీ డిస్కౌంట్ తో రూ. 27,999 రూపాయల ఆఫర్ ధరకు సేల్ అవుతోంది.
ఇది కాకుండా ఈ ఫోన్ ను ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్ తో ఈ ఫోన్ ను కొనుగోలు చేసే కొనుగోలుదారులకు రూ. 2,000 రూపాయల అదనపు డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ బ్యాంక్ ఆఫర్ తో గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ ను రూ. 25,999 రూపాయల ఆఫర్ ధరకి పొందవచ్చు.
Also Read: కేవలం రూ. 999 రూపాయలకే ANC Buds లాంచ్ చేసిన itel.!
Google Pixel 7a : ఫీచర్స్
ఈ గూగుల్ ఫోన్ Tensor G2 ప్రోసెసర్ మరియు Titan M2 సెక్యూరిటీ చిప్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 8GB ర్యామ్ మరియు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 6.1 ఇంచ్ 24 Bit స్క్రీన్ ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, 90 Hz రిఫ్రెష్ రేట్ మరియు HDR సపోర్ట్ తో వస్తుంది.
ఈ ఫోన్ లో 64MP (OIS) మెయిన్ కెమెరా మరియు 13MP అల్ట్రా వైడ్ కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా వుంది. గూగుల్ పిక్సెల్ 7a స్మార్ట్ ఫోన్ లో ముందు 13MP సెల్ఫీ కెమెరా కూడా వుంది. ఈ కెమెరా ఫోటో అన్ బ్లర్, మ్యాజిక్ ఎరేజర్ మరియు నైట్ సైట్ వంటి చాలా కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది.