Google Pixel 2 అండ్ Pixel 2 XL స్మార్ట్ ఫోన్స్ 27అక్టోబర్ న భారత్ లో లాంచ్ .

Updated on 24-Oct-2017
HIGHLIGHTS

పిక్సెల్ 2 ఒక 5-అంగుళాల ఫుల్ HD డిస్ప్లేని కలిగి ఉండగా, పిక్సెల్ 2 XL 6 అంగుళాల QHD + డిస్ప్లే 18: 9 యాస్పెక్ట్ రేషియో తో వస్తుంది.

గూగుల్ యొక్క కొత్త పిక్సెల్ 2 మరియు పిక్సెల్ 2 XL స్మార్ట్ఫోన్లు భారతదేశంలో అక్టోబర్ 27 న ప్రారంభించబడుతున్నాయి .కంపెనీ దీనికోసం మీడియా ని ఇన్వైట్ చేసింది . అక్టోబర్ 26 నుండి ప్రీ ఆర్డర్స్ స్టార్ట్ అవుతాయి.  పిక్సెల్ 2 మరియు పిక్సెల్ 2XL ఈ నెల ప్రారంభం లోనే వెల్లడయ్యాయి. రెండు ఫోన్స్  స్పెక్స్ సమానంగా ఉంటాయి, ఈ స్మార్ట్ఫోన్లు మధ్య వ్యత్యాసం వారి స్క్రీన్ సైజ్ .

పిక్సెల్ 2 ఒక 5-అంగుళాల ఫుల్  HD డిస్ప్లేని కలిగి ఉండగా, పిక్సెల్ 2 XL 6 అంగుళాల QHD + డిస్ప్లే 18: 9 యాస్పెక్ట్ రేషియో తో వస్తుంది. రెండు ఫోన్స్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 835 SoC మరియు 4GB RAM కలిగి ఉంటాయి. రెండు ఫోన్స్  64GB మరియు 128GB స్టోరేజ్  వేరియంట్స్ లో  అందుబాటులో ఉన్నాయి.ప్రస్తుతం, ఈ రెండు స్మార్ట్ఫోన్ల ధర భారతదేశంలో బయటపడలేదు, అయితే US లో, పిక్సెల్ 2 ధర $ 649 (సుమారు రూ 42,000), పిక్సెల్ 2 ఎక్స్ఎల్ ధర $ 849 (సుమారు 55,000 రూపాయలు) వద్ద మొదలవుతుంది. ఈ రెండు ఫోన్లలోరేర్ కెమెరా 12.2MP , f / 1.8 అపార్చర్ తో ఉంది. ప్రస్తుత ప్రాసెసర్ HDR + mod 5x వేగవంతంగా పనిచేస్తుంది.

ఫ్లిప్కార్ట్ లో నేడు హెడ్ఫోన్స్ మరియు బ్లూటూత్ స్పీకర్ల పై భారీ ఆఫర్స్

 

Connect On :