ఆండ్రాయిడ్ next వెర్షన్ N యొక్క డెవలపర్ ప్రివ్యూ రిలీజ్

ఆండ్రాయిడ్ next వెర్షన్ N యొక్క డెవలపర్ ప్రివ్యూ రిలీజ్

గూగల్ ఆండ్రాయిడ్ నెక్స్ట్ ఆపరేటింగ్ సిస్టం – ఆండ్రాయిడ్ 'N' రిలీజ్ చేయనుంది ఈ ఇయర్ లో. దీనికి సంబంధించి గూగల్ ఇప్పుడు మొదటి డెవలపర్ ప్రివ్యూ ను రిలీజ్ చేసింది.

కంపెని usual గా dev preview ను annual I/O కాన్ఫరెన్స్ లో రిలీజ్ చేస్తుంది. ఇది may 18 నుండి 20 వరకూ జరగనుంది.

రిలీజ్ అయిన ఆండ్రాయిడ్ 'N' developer preview కేవలం నెక్సాస్ 6, నెక్సాస్ 5X, నెక్సాస్ 6P, నెక్సాస్ 9, నెక్సాస్ player అండ్ Pixel C టాబ్లెట్ మోడల్స్ కు మాత్రమే అందుబాటులో ఉంది.

ఆండ్రాయిడ్ N కు కంపెని ఇంకా పేరును ఖరారు చేయలేదు కాని Nutella అవ్వచ్చు అని కంపెని SVP అన్నారు. దీనిలో ఉండవనున్న కొత్త ఫీచర్స్ …

1. మల్టీ విండో సపోర్ట్ – ఒక దానిపైన ఒకటి కాని ఒక దాని ప్రక్కన ఒకటి కాని రెండు యాప్స్ ను ఒకే సారి ఓపెన్ చేసుకొని వాడుకోగలరు స్క్రీన్ పై. అంటే కూల్ ప్యాడ్ మొబైల్స్ లో ఉన్న splitscreen మొద లా ఉంటుంది.

2. sms లేదా text మెసేజింగ్ యాప్స్ కు నోటిఫికేషన్ వద్ద నుండే replies ను ఇచ్చే ఫీచర్ ను యాడ్ చేసింది. అలాగే మెసేజెస్ ను గ్రూప్స్ గా డివైడ్ చేస్తుంది.

3. డేటా saver మోడ్ – ఇది బ్యాక్ గ్రౌండ్ లో రన్ అయ్యే యాప్స్ ఇంటర్నెట్ డేటా ను ఎక్కువుగా వాడకుండా చేస్తుంది మరియు foreground లో యాప్స్ వాడె డేటా ను కూడా లిమిట్ చేయగలదు.

4. ఆండ్రాయిడ్ M లో ప్రవేసపెట్టిన Doze ఫీచర్ ద్వారా బ్యాక్ గ్రౌండ్ యాప్స్ మరింత ఆర్గనైజ్ గా రన్ చేయిస్తూ బ్యాటరీ ను మరింత సేవ్ చేస్తుంది. దీని వలన OS, ర్యామ్ ను తక్కువగా వాడుతుంది.

గూగల్ ఆండ్రాయిడ్ బీటా ప్రోగ్రాం పేరుతో ఆండ్రాయిడ్ N beta వెర్షన్ ను try చేయటానికి allow చేస్తుంది users కు. ఇందుకోసం users program లో enroll అవ్వాలి. అంతేకాదు తమ డివైజ్ లను ఫ్లాష్ చేయటానికి worry అవకూడదు users.

Shrey Pacheco

Shrey Pacheco

Writer, gamer, and hater of public transport. View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo