11 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతున్న లేటెస్ట్ Google ఫోన్.!

Updated on 06-Feb-2023
HIGHLIGHTS

Google లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరకే అందుకునే అవకాశం

11 వేల భారీ డిస్కౌంట్ సేల్ అవుతున్న Google ప్రీమియం ఫోన్

బ్యాంక్ అఫర్ కూడా ఈ ఫోన్ పైన అందుబాటులో వుంది

Google ఇండియాలో లేటెస్ట్ గా విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ ను చాలా చవక ధరకే అందుకునే అవకాశం Flipakrt అందించింది. గూగుల్ ఇండియాలో ఇటీవల విడుదల చేసిన లేటెస్ట్ స్మార్ట్ ఫోన్ Pixel 6a ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుండి ఏకంగా 11 వేల రూపాయల భారీ డిస్కౌంట్ తో సేల్ అవుతోంది. అంటే, గూగుల్ యొక్క ఈ ప్రీమియం ఫోన్ ను ఇప్పుడు మిడ్ రేంజ్ ధరలోనే అందుకోవచ్చు. ఈ స్మార్ట్ ఫోన్ బెస్ట్ కెమెరా సిట్టింగ్ తో పాటుగా చాలా ఆకర్షణీయమైన ఫీచర్లతో వస్తుంది. అంతేకాదు, 1000 రూపాయల అదనపు డిస్కౌంట్ అందించే బ్యాంక్ అఫర్ కూడా ఈ ఫోన్ పైన అందుబాటులో వుంది. ఇంకెందుకు ఆలశ్యం గూగుల్ పిక్సెల్ 6a డిస్కౌంట్ అఫర్ గురించి తెలుసుకుందాం పదండి.    

Google Pixel 6a: ధర మరియు ఆఫర్లు

ఇండియాలో గూగుల్ పిక్సెల్ 6a ముందుగా రూ.43,999 ధరతో ఫ్లిప్‌కార్ట్ నుండి లాంచ్ చేయబడింది. ఈ ఫోన్ ప్రస్తుతం 11,000 రూపాయల భారీ డిస్కౌంట్ తో కేవలం రూ.32,999 అఫర్ ధరకే ఫ్లిప్ కార్ట్ నుండి లభిస్తోంది. అదనంగా, HDFC బ్యాంక్ డెబిట్/క్రెడిట్ కార్డ్ ను ఉపయోగించి ఈ ఫోన్ ను కొనుగోలు చేసే వారికి  1,000 రూపాయల డిస్కౌంట్ కూడా లభిస్తుంది. అంటే, గూగుల్ పిక్సెల్ 6a పైన 12 వేల రూపాయల భారీ డిస్కౌంట్ అందుకోవచ్చన్న మాట.          

Google Pixel 6a: స్పెక్స్

గూగుల్ పిక్సెల్ 6ఎ స్మార్ట్ ఫోన్ 6.14-అంగుళాల FHD + (2340 x 1080 పిక్సెల్స్) రిజల్యూషన్ డిస్‌ప్లేను కలిగి ఉంది మరియు ఇది OLED ప్యానెల్‌. ఈ డిస్ప్లే ఎగువ మధ్యలో పంచ్-హోల్ కటౌట్ కలిగి ఉంది. పిక్సెల్ 6 ఎ స్మార్ట్ ఫోన్ Google టెన్సర్ యొక్క శక్తితో నడుస్తుంది. ఇఇది 6GB RAM మరియు 128GB స్టోరేజ్ తో జత చేయబడింది.

గూగుల్ పిక్సెల్ 4 ఎ, డ్యూయల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో, 12.2 MP డ్యూయల్ పిక్సెల్ వైడ్ కెమెరా మరియు 12MP అల్ట్రా వైడ్ కెమెరాలతో వస్తుంది. ఈ కెమెరాలు OIS మరియు EIS లకు కూడా సపోర్ట్ కలిగి ఉంటాయి. పిక్సెల్ 6 ఎ యొక్క కెమెరా Live HDR+, సినీమ్యాటిక్ పాన్, డ్యూయల్ ఎక్స్ పోజర్ కంట్రోల్స్, వంటి చాలా ఫీచర్లను కలిగి వుంది. ఈ ఫోన్ వెనుక కెమెరాతో 30Kps/60Kps వద్ద 4K, 30/60fps వద్ద 1080p మరియు 240fps వరకు 720p రికార్డ్ చేయగలదు. ఇందులో 8MP సెల్ఫీ కెమెరాను కూడా కలిగి వుంది.

Pixel 6 a ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కలిగిన 4,410 ఎమ్ఏహెచ్ బ్యాటరీని కలిగి వుంది. అలాగే, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు IP67 వాటర్ ప్రొటక్షన్ తో వస్తుంది.

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :