గూగల్ తన సొంత బ్రాండ్ పేరుతో స్మార్ట్ ఫోన్స్ రిలీజ్ చేయటానికి రెడీ అవుతుంది. రెడీ అంటే ఏదో 2017 లేదా రెండు సంవత్సరాల తరువాత కాదు, వచ్చే నెలలోనే.
సెప్టెంబర్ లో ఇండియాతో పాటు మరి కొన్ని దేశాలలో రానుంది అని రిపోర్ట్స్. వీటి కన్నా ముందు ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ Nougat OS వెర్షన్ తో రెండు స్మార్ట్ ఫోనులను రిలీజ్ చేస్తుంది.
ఒకటి 5 in మరొకటి 5.5 in స్క్రీన్ సైజెస్ లో రానున్నాయి. ఇండియన్ మార్కెట్ లో ఒక సోర్స్ ప్రకారం 32GB మరియు 128GB వేరియంట్స్ తో వస్తున్నాయి.
అయితే ఆండ్రాయిడ్ N తో వచ్చే ఈ రెండూ nexus సిరిస్ లో వస్తున్నాయి కాని సెప్టెంబర్ లో వచ్చేవి మాత్రం డైరెక్ట్ గూగల్ బ్రాండ్ తో వస్తున్నాయి.
ఇవి ప్రీమియం గా ఓవర్ ఆల్ గా సూపర్ ఎక్స్పీరియన్స్ ను అందిస్తూ ఆపిల్ ఐ ఫోన్ లకు పోటిగా ఉండేలా గూగల్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.
ఈ క్రింద బెస్ట్ ఆండ్రాయిడ్ లాక్ స్క్రీన్ యాప్ గురించి తెలుగులో ఒక వీడియో చేయటం జరిగింది. చూడగలరు..