షావోమి యొక్క MIUI 10.2.1 లో గూగుల్ అసిస్టెంట్ షార్ట్ కట్ అందుకుంది

Updated on 06-Feb-2019
HIGHLIGHTS

పవర్ బటన్ కొత్త షార్ట్ కట్ గా ఉంటుంది.

షావోమి, చైనాలో తన Mi8 స్మార్ట్ ఫోన్లను విడుదల చేసినపుడు MIUI 10 ని ప్రకటించింది. పూర్తి స్క్రీన్ గెశ్చర్స్ కి సపోర్ట్ చేసేవిధంగా ఆండ్రాయిడ్ సిస్టంతో ఈ UI యొక్క పనితీరును అభివృద్ధిచేసింది.అయితే, MIUI 10 వాడుతున్నపుడు మాత్రం, హోమ్ బటన్ నొక్కడంతో తెరుచుకునే గూగుల్ అసిస్టెంట్ యొక్క సాధారణ పద్దతికి సంబంధించిన సాఫ్ట్ వేర్ బటన్లను మాత్రం తీసివేసింది. దీనివల్ల, ప్రామాణిక మార్గంలో ,ఈ గూగుల్ అసిస్టెంట్ బూట్ చెయ్యలేరు . అయితే,  MIUI 10.2.1 అప్డేట్ నుండి ఈ స్మార్ట్ అసిస్టెంట్ కోసం పవర్ బటన్ను వేదికగా ఇచ్చినట్లు XDA Developers గుర్తించారు.

ఈ MIUI 10.2.1 చేసిన మార్పుల ద్వారా నావిగేషన్ గెశ్చర్స్ వాడుతున్నపుడు గూగుల్ అసిస్టెంట్ ని ఎనేబుల్ చేస్తుంది. అయితే, ఇది ఎలా సాధ్యమవుతుందంటే, ఫోను యొక్క పవర్ బటన్ను0.5 సెకన్ల పాటు నొక్కడంతో ఈ స్మార్ట్ అసిస్టెంట్ ఎనేబుల్ చేయబడుతుంది. అయితే, ఇది తనతటతానుగా ఒక ఎంపికగా మాత్రం రాదు, దీనికోసం ఫోన్ యొక్క సెట్టింగ్ మెనూ లోకి వెళ్లి "Button and Gesture Shortcuts" ఎనేబుల్ చేయవలసి ఉంటుంది. కానీ, ఇక్కడ డిలే టైమర్ సెట్ చెయ్యడానికి మాత్రం ఎటువంటి ఎంపిక ఇవ్వలేదు. అంటే, ఈ స్మార్ట్ అసిస్టెంట్ ఓపెన్ చేయడానికి ఇచ్చిన డిఫాల్ట్ టైంతోనే ఇది నడుస్తుంది.

కంపెనీ యొక్క ప్రోడక్ట్ మేనేజర్ అయినటువంటి, సుదీప్ సాహు మాట్లాడుతూ, స్పీడ్, సౌండ్, డిజైన్ మరియు AI పోర్ట్రైట్ ఇమేజ్ పైనే మంచి పట్టుసాధించేలా MIUI10 ఉండేవిధంగా దీని పైన కంపెనీ ఎక్కువగా దృష్టిసారిస్తుందని తెలిపారు. అలాగే, కేవలం స్వైప్ చెయ్యడంతో ఆప్ లను తీసివేయడం వంటివి అందిస్తుంది. ఇక ఆడియో పరముగా చూస్తే, మీరు అందుకునే ప్రతి మెసేజికి కూడా నోటిఫికేషన్ టోన్ మారుతుంటుంది.

దీనికి అదనంగా, కేవలం భారతీయుల కోసం ఈ MIUI 10 లో కొన్ని మార్పులు చేసినట్లు కూడా తెలిపారు. ఇందులోని వెబ్ బ్రౌజర్  లోకల్ సర్వీసులతో కూడా    ప్రోగ్రెసివ్ వెబ్ ఆప్స్ (PWA)కి సపోర్టు చేయగల ఒక డేడికేటెడ్ పేజీతో వస్తుంది. అలాగే, కెమేరాలు కూడా Paytm QR codes త్వరగా గుర్తించగలవు మరియు మెసేజ్ ఆప్ లలో వచ్చే అన్ని బిజినెస్ మెసేజిల కోసం ఒక క్విక్ మెనూ ట్యాబ్ కూడా ఉంటుంది.           

Raja Pullagura

Crazy about tech...Cool in nature...

Connect On :