సెప్టెంబర్ 29 న గూగల్ లాంచ్ invite.

Updated on 21-Sep-2015
HIGHLIGHTS

నేక్సాస్ ఫోన్ లాంచ్ చేస్తుంది అని రిపోర్ట్స్

San Francisco లో సెప్టెంబర్ 29 న గూగల్ ఈవెంట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన invites ను కూడా పంపింది. అయితే ఈవెంట్ పై ఇతర ఇన్ఫర్మేషన్ ఏమీ వెల్లడికాలేదు.

రూమర్స్ ప్రకారం ఈ ఈవెంట్ లో అప్ కమింగ్ నేక్సాస్ స్మార్ట్ ఫోన్స్, ఆండ్రాయిడ్ లేటెస్ట్ os వెర్షన్, marshmallow availability మరియు chromecast లేటెస్ట్ మోడల్ ను రిలీజ్ చేయనుంది.

ఇప్పటివరకూ ఒక నేక్సాస్ డివైజ్ ను లాంచ్ చేసిన గూగల్, ఇప్పుడు రెండు నేక్సాస్ ఫోన్స్ ను ఒకేసారి చేయనుంది అని రిపోర్ట్స్. రెండూ LG అండ్ huawei చే తయారు చేయబడినవి.

ఈ రెండూ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్ అండ్ ఆండ్రాయిడ్ M os లతో రానున్నాయని అని న్యూస్. ఇవి 26,300 రూ నుండి 29,600 రూ ర్యాంజ్ లో ఉండవచ్చు అని అంచనా. అలాగే బెటర్ wifi సపోర్ట్ తో chromecast కూడా వస్తుంది. 

Digit NewsDesk

Digit News Desk writes news stories across a range of topics. Getting you news updates on the latest in the world of tech.

Connect On :