గూగల్ తరువాతి OS, ఆండ్రాయిడ్ M రిలీజ్ అయ్యింది.

గూగల్ తరువాతి OS, ఆండ్రాయిడ్ M రిలీజ్ అయ్యింది.
HIGHLIGHTS

సెక్యురిటీ, బ్యాటరీ లైఫ్ మీద ఫోకస్ చేసిన ఆండ్రాయిడ్ M

తాజాగా జరిగిన గూగల్ I/O 2015 డెవెలపర్ కాన్ఫిరెన్స్ లో గూగల్ తన తదుపరి ఆండ్రాయిడ్ వెర్షన్ ఆండ్రాయిడ్ M ను అనౌన్స్ చేసింది. జెనెరల్ గా  కొత్త వెర్షన్ ఓస్ వచ్చింది అంటే కొంతమంది యూజర్ ఇంటర్ఫేస్ మార్పులు కోసం ఎదురు చూస్తారు. కాని ఆండ్రాయిడ్ ఒక సారి యూజర్ ఇంటర్ఫేస్ మార్పులను మేజర్ గా దించింది అంటే, దాని తరువాతి వెర్షన్ లో కేవలం కొన్ని సెక్యురిటీ మరియు ఇతర ఫీచర్స్ ను మాత్రమే మార్చి దించుతుంది. సో ఇప్పుడు ఆండ్రాయిడ్ M లో యూజర్ ఇంటర్ఫేస్ మార్పులు, చేర్పులు ఏమి ఉండవు, కాని సెక్యురిటి మరియు బ్యాటరీ లైఫ్ పై కొన్ని అదనపు ఫీచర్స్ ఏడ్ అయ్యాయి. అనౌన్స్మెంటు తో పాటు డెవెలపర్ ప్రివ్యూ ను విడుదల చేసారు. ఫైనల్ వెర్షన్ ఈ సంవత్సరం చివరికి విడుదల కానుంది.

ఆండ్రాయిడ్ M లో జోడించిన ఫీచర్స్ –

ఆప్ పర్మిషన్: మనం సాధారణంగా ఆప్స్ ను ఇంస్టాల్ చేసుకునేటప్పుడు ఆప్స్ కొన్ని పెర్మిషన్స్ అడుగుతాయి, వాటిని మనం ఒప్పుకుంటేనే ఆప్ పనిచేస్తుంది. అందులో మీకు నచ్చని (కాంటాక్ట్స్, మేసేజ్స్, పెర్సనల్ ఫైల్స్ ఏక్సిస్) పెర్మిషన్స్ ఉన్నా, మీరు కచ్చితంగా ఒప్పుకుంటేనే ఆప్ ఇంస్టాల్ అయ్యేది. అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ M లో మీరు ఇంస్టాల్ చేసుకోబోయే ఆప్ కు మీకు నచ్చిన విధంగా పెర్మిషన్స్ ఇవ్వచ్చు. మీకు నచ్చని పెర్మిషన్స్ డినే చేసుకునే సౌలభ్యం ఉంది. మీరు ఇవ్వని పెర్మిషన్ కు సంబందించి బ్యాక్ రౌండ్ లో అప్లికేషన్ వాడవలిసి వస్తే అదే రన్ టైం లో మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది. అప్పుడు మీరు ఒకే చేయవచ్చు.

బ్యాటరీ లైఫ్: కొన్ని మోషన్ సేన్సర్స్ సహాయంతో మీ ఫోన్ స్టాండ్ బై లో ఉందా, వాడుకులో ఉందా తెలుసుకొని, దాని బట్టి బ్యాక్ రౌండ్ సర్వీసెస్ అన్ని ఆపి ఫోన్ బ్యాటరీ బ్యాక్ అప్ ను పెంచనుంది ఆండ్రాయిడ్ M. దీనితో పాటు గూగల్, కొన్ని ఫోన్ కంపెని లతో ఒక ఫోన్ బ్యాటరీ నుండి వేరే ఫోన్ కు చార్జింగ్ జరిగేలా కొత్త ప్రాజెక్ట్ పై పనిచేస్తుంది. ఇది usb చార్జర్ స్టాండర్డ్ usb-c పోర్ట్ ద్వారా సాధ్యం అవుతుంది.

ఆఫ్ లైన్ ఆప్స్: స్లో ఇంటర్నెట్ స్పీడ్ ఉన్న మర్కెట్స్ ను టార్గెట్ చేసుకొని గూగల్ ఆఫ్ లైన్ క్రోమ్ మరియు ఆఫ్ లైన్ గూగల్ మ్యాప్స్  వ్యూ ను తీసుకు వచ్చింది ఆండ్రాయిడ్ M లో. గూగల్ సర్చ్ రిసల్ట్స్ కూడా అప్పటి నెట్ కనెక్షన్ బట్టి పనిచేస్తుంది. స్లో నెట్ కనెక్షన్ ఉంటే తక్కువ ఇమేజెస్ మరియు అప్టిమైజేడ్ పేజెస్ సర్చ్ లో వస్తాయి. గూగల్ మ్యాప్స్ మరియు క్రోమ్ యూట్యూబ్ ఆఫ్ లైన్ ఫీచర్ వలె పనిచేస్తాయి.

నౌ ఆన్ టాప్: గూగల్ నౌ ఆప్ ను కూడా ఆండ్రాయిడ్ M లో ఇంప్రూవ్ చేసింది గూగల్. నౌ ఆన్ టాప్ అనే ఫీచర్ తో మీరు ఇప్పుడు హోమ్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే మీకు కావలిసిన సమాచారాన్ని పొందగలరు. ఈ కొత్త ఫీచర్ గూగల్ నౌ కార్డ్స్ ను ఇమెయిల్ మరియు వెబ్ బ్రౌజర్ వంటి ఆప్స్ లో వాడుకునే లా అనుమతి కూడా ఇస్తుంది.

ఫోటోస్ అప్ గ్రేడ్: మనం గతంలో చెప్పుకున్నట్టు గా గూగల్ ఫోటోస్ ఆప్ ను మరింత ఇంప్రూవ్ చేసింది. యూజర్స్ ఇప్పుడు అన్ లిమిటెడ్ ఫోటోస్, వీడియోస్ ను బ్యాక్ అప్ చేసుకునే ఫీచర్ ఏడ్ చేసింది. ఆటో ట్యాగింగ్, డెడికేటెడ్ అసిస్టంట్ టాబ్, ఇమేజెస్ ఆర్గనైజేషన్ ను అదనపు కొత్త ఫీచర్స్. ఫోటోస్ ఆప్  అప్డేట్ ను ఆల్రెడీ గూగల్ బయటకు వదులుతుంది.

ఆండ్రాయిడ్  ప్లే మరియు ఫింగర్ ప్రింట్ సపోర్ట్: గూగల్ ఫైనల్ గా ఆండ్రాయిడ్ M లో ఫింగర్ ప్రింట్ స్కానింగ్ ను లాంచ్ చేసింది.ఇది నేటివ్ ఆండ్రాయిడ్ M ఫింగర్ ప్రింట్ సపోర్ట్. దీని ద్వారా ఇక నుండి మీ ఫోనులో ఫింగర్ ప్రింట్ సెన్సార్ హార్డ్వేర్ ఉన్నట్లయితే ప్లే స్టోర్ లోని ఆప్స్, మరియు బయట స్టోర్స్ లో ఫోన్ ద్వారా పేమెంట్ చేసుకోవడం, ఫోన్ సెక్యురిటి మొదలైనవి నేటివ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ తో సెక్యూర్ గా చేసుకోవచ్చు. దీని కోసం గూగల్ ఆండ్రాయిడ్ ప్లే అనే కొత్త కాన్సెప్ట్ ను డెవెలప్ చేస్తుంది. కాకపోతే ఇది మన ఇండియాలో ప్రాక్టికల్ వర్క్ అవుట్ అవ్వాలంటే కొంచెం టైం పడుతుంది.

Kul Bhushan
Digit.in
Logo
Digit.in
Logo