Gionee M5 తాజాగా విడుదల చేసిన ఏడ్ పోస్టర్ లో రెండు బ్యాటరీలు ఫోన్ తో పాటు వస్తున్నట్టు ఏడ్ రిలీజ్ చేసింది. నాలుగు రోజులు బ్యాక్ అప్ ఇవనున్నాయి ఈ రెండు బ్యాటరీలు.
ఈ సంవత్సరం మొదట్లో విడుదల అయిన మారథాన్ M3 కి M5 తరువాతి మోడల్. ఈ సిరిస్ లో గతంలో విడుదలైన M2, M3 మోడల్స్ కు 4,200mah మరియు 5000mah కెపాసిటీ బ్యాటరీలు ఉన్నాయి. రూమర్స్ ప్రకారం M5 లో వచ్చే రెండు బ్యాటరీలు ఒకొక్కటి 2,500mah కెపాసిటి ఉండనున్నాయట.
ఒకటి చార్జింగ్ అవుతుండగా, రెండో బ్యాటరీ ఒక్క దానిపై ఫోన్ పనిచేయనుంది అట. రెండూ పూర్తిగా చార్జ్ అయిపోయాక కంపెని బ్యాక్ అప్ నాలుగు రోజులు వస్తుంది అని చెబుతుంది. మరో రెండు వారాలలో మరిన్ని వివరాలు తెలియనున్నాయి.
తాజగా Innos D6000 అనే కంపెని రెండు బ్యాటరీలు తో 6000mah కెపాసిటి కలిగిన మోడల్ ను లాంచ్ చేసింది. 5.2 అంగుళాల డిస్ప్లే, స్నాప్ డ్రాగన్ 615 1.8 GHz ఆక్టో కోర్ ప్రాసెసర్ మరియు 3జిబి ర్యామ్ 32జిబి స్టోరేజి తో చైనా లో జూన్ నెలలో మార్కెట్లోకి రానుంది Innos D6000.
Gionee Elife E8 పేరు తో E7 తరువాతి మోడల్ ను లాంచ్ చేసేందుకు సన్నిదమవుతుంది. 23MP రేర్ కెమేరా కలిగిన ఈ ఫోన్ తో `100MP ఇమేజెస్ ను తీసుకోవచ్చు. మల్టిపిల్ ఫోటోలను తీసి ఒక దానిగా జత చేస్తే అవి 100 MP క్వాలిటీతో వస్తాయి. ఇదే విధంగా Oppo Find7 స్మార్ట్ ఫోన్ కూడా పనిచేస్తుంది. Gionee Elife E8 కు 4.6 అంగుళాల డిస్ప్లే , 1440 x 2560 క్వేడ్ HD రిసల్యుషణ్ మరియు 2.0 GHz ఆక్టో కోర్ ప్రాసెసర్ , 3జిబి ర్యామ్, 32 జిబి స్టోరేజి, 3520mah బ్యాటరీ ఉన్నాయి. ఈ హ్యాండ్ సెట్ సొంత ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో రానుంది అని రూమర్స్. అవుట్ ఆఫ్ ది బాక్స్ లాలిపాప్ తో రానుంది ఫోన్. మరి కొన్ని వారాల్లో ఫోన్ విడుదల కానుంది.
ఆధారం: Gizmo China