లాలిపాప్ os తో 5000 mah బ్యాటరీ తో కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్

Updated on 04-Aug-2015

Gionee బ్రాండ్ లో Marathon M5 పేరుతో కంపెని కొత్త మోడల్ లాంచ్ చేసింది ఇండియాలో. దీని ధర 15,499 రూ. మరి ధరకు తగ్గా స్పెక్స్ ఉన్నాయా లేదా చూద్దాం రండి..

మారథాన్ M5 స్పెసిఫికేషన్స్ – డ్యూయల్ సిమ్, 5 in HD సూపర్ ఎమోలేడ్ 720 x 1280 పిక్సెల్స్ డిస్ప్లే, 1.3GHz క్వాడ్ కోర్ ప్రొసెసర్, 2GB ర్యామ్, 8MP మరియు 5MP కెమేరాస్, 5000 mah బ్యాటరీ, 4G, 3G, 16GB ఇంబిల్ట్ స్టోరేజ్, 32 అదనపు స్టోరేజ్ సపోర్ట్, ఆండ్రాయిడ్ లాలిపాప్ 5.0, అమిగో 3.0 యూజర్ ఇంటర్ఫేస్.

కంపెని ప్రొమోషన్ ప్రకారం బ్యాటరీ 400 గంటలు బ్యాక్ అప్ ఇస్తుంది. బ్యాటరీ mah పెద్దగా ఉంది కాని కెమేరా విషయం లో కాంప్రమైజ్ అయ్యింది అని చెప్పాలి. 13MP కెమేరా లతో అండర్ 7K బడ్జెట్ లోనే ఫోనులు వస్తున్నాయి. అయితే కెమేరా MP లోనే కాదు సెన్సార్ లో కూడా దాని పనితనం దాగి ఉంటుంది అని మీరు తెలుసుకోవాలి. 

బ్లాక్ మరియు వైట్ కలర్ వేరియంట్స్ లో ఫోన్ ఆఫ్ లైన్ మరియు ఆన్ లైన్ స్టోర్స్ లో లభిస్తుంది. ప్రస్తుతానికి ఈ మొబైల్ కొనటానికి ebay లో ఈ లింక్ లో లిస్టింగ్ అయి ఉంది. అయితే మీకు కావలసిన మొబైల్ రిలీజ్ అయ్యిందని వెంటనే కోనేయకుండా దాని యూజర్ రివ్యూస్ అవి చదివి కొనటం మంచిది. అలాగే వెయిట్ చేస్తే ప్రైస్ డ్రాప్ అవటం కూడా జరుగుతుంది.

PJ Hari

Gadget Geek. Movie Buff. Non fiction Books

Connect On :