Samsung Galaxy S25 Series లాంచ్ డేట్ అనౌన్స్ చేసిన వెంటనే గెలాక్సీ S24 ప్లస్ రేటు భారీగా పడిపోయింది. దాదాపు లక్ష రూపాయల ధరతో ఇండియన్ మార్కెట్లో లాంచ్ స్మార్ట్ ఫోన్ ఇప్పుడు చాలా తక్కువ ధరకు లభిస్తుంది. . కొత్త ఫోన్ రాకతో పాత ఫోన్ రేట్లు భారీగా తగ్గినట్లు చూడవచ్చు. ప్రస్తుతం ఈ శాంసంగ్ ప్రీమియం ఫోన్ మిడ్ రేంజ్ ధరలో అందుకునే అవకాశం ఉంది.
శామ్సంగ్ గెలాక్సీ S25 సిరీస్ లాంచ్ డేట్ అనౌన్స్ తర్వాత గెలాక్సీ S24 ప్లస్ రేటు దాదాపు 37 వేల రూపాయలు తగ్గింపు అందుకుంది. గెలాక్సీ S24 ప్లస్ ప్రస్తుతం రూ. 62,999 ధరతో అమెజాన్ నుండి లభిస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ బేసిక్ వేరియంట్ ఈ ధరతో లభిస్తుంది. అయితే, ఈ ఫోన్ హై ఎండ్ 12GB + 512GB వేరియంట్ మాత్రం రూ. 74,999 ధరకు లభిస్తుంది. ఈ ఆఫర్ చెక్ చేయడానికి Click Here పై నొక్కండి.
Also Read: Amazon Upcoming Sale నుంచి స్మార్ట్ టీవీ పై భారీ ఆఫర్లు అందుకోండి.!
శామ్సంగ్ గెలాక్సీ S24 ప్లస్ స్మార్ట్ ఫోన్ శామ్సంగ్ యొక్క సొంత Exynos 2400 చిప్ సెట్ తో పని చేస్తుంది. ఈ ఫోన్ లో 8GB ర్యామ్ మరియు 256GB ఇంటర్నల్ స్టోరేజ్ ఉంటాయి. ఈ ఫోన్ ను స్పేస్ గ్రేడ్ అల్యూమినియం తో అందించింది. ఈ ఫోన్ 6.7 ఇంచ్ QHD+ AMOLED క్రీం ను కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్, 2600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ మరియు విజన్ బూస్టర్ ఫీచర్ కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో పవర్ ఫుల్ కెమెరా సెటప్ వుంది. ఈ ఫోన్ లో వెనుక 50MP మెయిన్, 10MP టెలిఫోటో మరియు 12MP అల్ట్రా వైడ్ సెన్సార్ లు కలిగిన ట్రిపుల్ రియర్ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP68 రేటింగ్ తో వాటర్ మరియు డస్ట్ రెసిస్టెంట్ గా ఉంటుంది. ఈ ఫోన్ లో 45W వైర్డ్ మరియు 15W వైర్లెస్ ఛార్జ్ సపోర్ట్ కలిగిన 4,900 బిగ్ బ్యాటరీ ఉంటుంది.