Huawei ఇంతకుముందు హానర్ పేరుతో సబ్ బ్రాండ్ డివైజ్ లను మంచి ఫీచర్స్ తో లాంచ్ చేసి ఇండియన్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ దగ్గర మంచి స్థానం సంపాదించుకుంది. Huawei బ్రాండింగ్ తో మొట్ట మొదటి సారి ఇండియన్ మార్కెట్ లోకి ఈ నాలుగు మోడల్స్ తో ఎంటర్ అవుతుంది కంపెని.
ఇప్పుడు కంపెని, 5,499 ప్రారంభ ధర నుండి 9,499 ధర వరకూ నాలుగు బడ్జెట్ మోడల్స్ ను లాంచ్ చేసింది. ఇవి ఆఫ్ లైన్ రిటేయిల్ స్టోర్స్ లో మాత్రమే సేల్ అవనున్నాయి. Y336, Y541, Y625 మరియు G620s మోడల్ సిరిస్ లలో లభించనున్నాయి.
స్మార్ట్ ఫోన్ బయర్స్ కు కొనేముందు వీటిపై హాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ ను ఇవ్వటానికే కంపెని ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెబుతుంది. వీటిలో G620s కు 1gb ర్యామ్, అడ్రెనో 306 GPU, ఆండ్రాయిడ్ కిట్ క్యాట్ v4.4.2, 5in డిస్ప్లే, 720P IPS LCD డిస్ప్లే, 2000 mah బ్యాటరీ.