ఫ్లిప్ కార్ట్ “Experience స్టోర్స్” ను ఓపెన్ చేస్తుంది

ఫ్లిప్ కార్ట్ “Experience స్టోర్స్” ను ఓపెన్ చేస్తుంది
HIGHLIGHTS

ఫ్లిప్ కార్ట్ లో దొరికే మొబైల్స్ ను ఇక కొనే ముందు బయట ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయగలరు

ఆన్ లైన్ రిటేయిల్ దిగ్గజం, ఫ్లిప్ కార్ట్ నెలకు ఒక కొత్త విన్యూత్నమైన ఫీచర్స్ తో ముందుకు వస్తుంది. ప్రస్తుతం "Assisted ఈ కామర్స్ మోడల్" ను ప్రవేసపెట్టే ఆఫ్ లైన్ సేల్స్ మార్కెట్ బిజినెస్ ను స్టార్ట్ చేయనుంది.

ఈ బిజినెస్ మోడల్ లో భాగంగా, ఫ్లిప్ కార్ట్ కస్టమర్స్ కు ఎక్స్పీరియన్స్ జోన్ ను తెస్తుంది. అంటే ఫ్లిప్ కార్ట్ లో ఉండే మొబైల్స్ కొనే ముందు బయట ఉన్న ఫ్లిప్ కార్ట్ ఎక్సిపిరియన్స్ స్టోర్స్ కు వెళ్లి చూడవచ్చు.

స్టోర్స్ లో డివైజ్ గైడన్స్ కూడా పొందుతారు. కస్టమర్ మొబైల్ ను ఫిక్స్ అయితే అక్కడే స్టోర్ లో ఫ్లిప్ కార్ట్ యాప్ నుండి ఆర్డర్ చేసి డెలివరి కూడా తీసుకోగలరు.

ఆల్రెడీ ఫ్లిప్ కార్ట్ కు 19 సిటీస్ లో 30 ఎక్స్పీరియన్స్ జోన్స్ ఉన్నాయి ఇండియాలో. స్పైస్ హాట్ స్పాట్ అవుట్ లెట్స్ లో ఉంటాయి ఇవి. కాని కంపెని ఎప్పుడూ మార్కెటింగ్ చేయలేదు వీటి గురించి.

రీసెంట్ గా జరిగిన బిగ్ బిలియన్ 2015 సేల్స్ లో ఫ్లిప్ కార్ట్ 5 డేస్ లో 1300 crores worth మొబైల్స్ అమ్మింది. అయితే ఇది వరకూ రిలయన్స్ డిజిటల్, croma వంటి స్టోర్స్ కూడా ఆన్ లైన్ అండ్ ఆఫ్ లైన్ సేల్స్ ను చేశాయి కాని సక్సెస్ కాలేదు ఇండియాలో. 

Adamya Sharma

Adamya Sharma

Managing editor, Digit.in - News Junkie, Movie Buff, Tech Whizz! View Full Profile

Digit.in
Logo
Digit.in
Logo