దొంగలించిన మొబైల్స్ అమ్మారని, ఫ్లిప్ కార్ట్ కు డిల్లీ పోలిస్ నోటిసులు
సోమవారం ఫ్లిప్ కార్ట్ కు బయట దొంగలించిన ఫోనులు వెబ్ సైట్ ద్వారా అమ్మారని నోటిసులు ఇచ్చింది డిల్లీ పోలిస్ బృందం. DCP, దినేష్ కుమార్ ఈ విషయన్ని వెల్లడించారు.
డిల్లీ లో జులై నెలలో హాంగ్ కాంగ్ నుండి ఇంపోర్ట్ అయిన 600 హై ఎండ్ మొబైల్ ఫోన్స్ షిప్మెంట్ ను దొంగలించారు కొంతమంది. దీని విలువ కోటి రూ.
అయితే దొంగతనం చేయబడిన హ్యాండ్ సెట్స్ ను ట్రేస్ చేస్తే.. అవి ఫ్లిప్ కార్ట్ లో కొన్నారని విషయం తెలిసింది. డిల్లీ లో మొబైల్ షాప్ ఉన్న హరేందర్ అనే వ్యక్తీ దొంగలించిన consignment లో కొన్ని మొబైల్స్ రవి అనే వ్యక్తీ కి అమ్మితే..
అతను వేరే వ్యక్తి కి అమ్మి.. అలా రెండు మూడు చేతులు మారి బెంగుళూరు లోని raunak అనే e-retail ఏజెంట్ కు చేతికి వచ్చాయి. ఇతను ఫ్లిప్ కార్ట్ తో పాటు మిగలిన సైట్లలో ఆన్ లైన్ సెల్లర్.
అయితే ఫ్లిప్ కార్ట్ ఈ విషయం పై స్పందిస్తూ.. "సెల్లర్ కనుక ఫేక్, stolen లేదా సెల్లింగ్ laws కు వ్యతిరేకంగా ఎటువంటి గూడ్స్ సేల్ చేసిన.. వారి పై చర్యలు తీసుకుంటాము" అని చెప్పింది.