హానర్ 10 లైట్ సేల్ యొక్క సేల్ ఈ మొదలైనదిఈ స్మార్ట్ ఫోన్ AI ఆధారిత కెమెరాలతో మరియు మెరుగుపరచబడిన ప్రొసెసరుతో చక్క ఆకట్టుకునేలా ఉంటుంది. మొదటి సరిగా సేల్ కి వచ్చి ఈ స్మార్ట్ ఫోన్ సొంతం చేసుకోవాలనుకునే వారు ఏ క్రింద ఇచ్చిన లింక్ ద్వారా కొనుగోలు చేయవచ్చు.
1. హానర్ 10 లైట్ – 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి ధర – Rs. 13,999
2. హానర్ 10 లైట్ – 4GB ర్యామ్ మరియు 64GB స్టోరేజి ధర – Rs. 17,999
అంతేకాకుండా, ఈ స్మార్ట్ ఫోను కొనుగోలుతో ఆకర్షణీయమైన ఆఫర్లు కూడా అంచుదాటులో వున్నాయి.
హానర్ 10 లైట్ స్పెసిఫికేషన్లను
ఈ హానర్ 10 లైట్ ఒక 6.51 అంగుళాల IPS LCD ఫుల్ HD + డిస్ప్లేను, 2280 x 1080 పిక్సెళ్లతో 19.5: 9 ఆస్పెక్ట్ రేషియాతో అందిస్తుంది. ఈ డివైజ్ HiSilicon Kirin 710 చిప్సెట్ను కలిగివుంది. అయితే, 16nm కిరిన్ 659 తో పోలిస్తే, ఈ కిరిన్ 710 సింగిల్ కోర్ యొక్క పనితీరు కిరిన్ 659 కంటే 75 శాతం అధికంగా నిలుస్తోందని ఈ సంస్థ చెబుతోంది. ఈ కిరిన్ 710ప్రాసెసర్, కిరిన్ 659 కంటే విద్యుత్ వినియోగం మరియు పెరఫార్మెన్స్ లో అభివృద్ధి సాధించింది మరియు ఇది Antutu పైన 131733 పాయింట్లు సాధించింది.
ఈ స్మార్ట్ ఫోన్ యొక్క వెనుక ప్యానెల్లో వేలిముద్ర సెన్సార్ను కలిగివుంటుంది. కెమెరా విభాగంలో, ఈ ఫోన్ 13MP ప్రాధమిక సెన్సార్ మరియు ఒక 2MP సెకండరీ సెన్సారుతో, వెనుక డ్యూయల్-కెమెరా సెటప్పును కలిగివుంటుంది. సెల్ఫీ కోసం, AI సామర్థ్యాలతో 24MP ముందు షూటర్ ఉంది. ఈ డివైజ్ GPU టర్బోతో వస్తుంది, ఇది 60 శాతం వరకు గ్రాఫిక్స్ పనితీరు మరియు సామర్థ్యాన్ని పెంచుతుంది. ఈ మొత్తం ప్యాకేజీ, ఒక 3,400mAh బ్యాటరీతో శక్తిని కలిగి ఉంది.