flipkart month end sale big deals on Nothing Phone (2a) 5G
ఫ్లిప్ కార్ట్ లేటెస్ట్ గా మంత్ ఎండ్ మొబైల్ ఫెస్టివల్ సేల్ ను అనౌన్స్ చేసింది. న నిన్నటి నుంచి మొదలైన ఈ ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి భారీ స్మార్ట్ ఫోన్ ఆఫర్ ఒకటి ప్రకటించింది. నథింగ్ బడ్జెట్ సూపర్ స్మార్ట్ ఫోన్ Nothing Phone (2a) 5G పై ఈ భారీ ఆఫర్ ను ప్రకటించింది. మార్కెట్లో 25 వేల రూపాయల ఉప బడ్జెట్ ధరలో విడుదలైన ఈ నథింగ్ ఫోన్ ను ఇప్పుడు ఫ్లిప్ కార్ట్ సేల్ నుంచి అన్ని ఆఫర్లు కలుపుకొని కేవలం 15 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం అందించింది.
నథింగ్ ఫోన్ 2a 5జి స్మార్ట్ ఫోన్ ఇండియన్ మార్కెట్లో రూ. 23,999 రూపాయల ప్రారంభ ధరతో లాంచ్ అయిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఫోన్ ఇప్పుడు ఫ్లిప్ ఆకృతి మంత్ ఎండ్ సేల్ నుంచి రూ. 6,000 భారీ డిస్కౌంట్ తో కేవలం రూ. 17,999 రూపాయల ఆఫర్ ధరకే సేల్ అవుతోంది. అంతేకాదు ఈ స్మార్ట్ ఫోన్ పై రూ. 2,000 అదనపు డిస్కౌంట్ అందుకునే అవకాశం కూడా అందించింది. వాస్తవానికి, ఈ ఫోన్ యొక్క అన్ని వేరియంట్స్ పై రూ. 6,000 డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది.
నథింగ్ ఫోన్ 2a 5జి స్మార్ట్ ఫోన్ ను IDFC మరియు ONECARD క్రెడిట్ కార్డ్ తో కొనుగోలు చేసే యూజర్లకు ఈ రూ. 2,000 అదనపు బ్యాంక్ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్ తో ఈ ఫోన్ ను కేవలం రూ. 15,999 రూపాయల అతి తక్కువ ధరకు అందుకోవచ్చు. ఈ ఫోన్ పై ఎక్స్ చేంజ్ ఆఫర్ లను కూడా ఫ్లిప్ కార్ట్ అందించింది. ఈ ఫోన్ హై ఎండ్ 12GB + 256GB వేరియంట్ ను సైతం అన్ని ఆఫర్స్ కేవలం రూ. 19,999 ధరకే అందుకోవచ్చు.
Also Read: SAMSUNG Galaxy S23 Ultra 5G ప్రైస్ ను భారీగా తగ్గించిన ఫ్లిప్ కార్ట్.!
ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ మీడియాటెక్ Dimensity 7200 Pro చిప్ సెట్ తో పని చేస్తుంది. ఇందులో 8GB ఫిజికల్ ర్యామ్ మరియు 8GB ర్యామ్ బూస్టర్ ఫీచర్ కూడా ఉంటుంది. అదే 12GB వేరియంట్ అయితే 12GB ఫిజికల్ మరియు 8GB ర్యామ్ బూస్ట్ తో కలిపి టోటల్ 20GB ర్యామ్ ఆఫర్ చేస్తుంది. ఈ ఫోన్ లో 128GB / 256GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.
ఈ నథింగ్ స్మార్ట్ ఫోన్ 6.7 ఇంచ్ Flexible AMOLED స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ FHD రిజల్యూషన్, గొరిల్లా గ్లాస్ 5 రక్షణ, ఇన్ స్క్రీన్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ మరియు 1300 నిట్స్ పీక్ బ్రైట్నెస్ తో పాటు HDR 10+ సపోర్ట్ కూడా కలిగి ఉంటుంది.
నథింగ్ ఫోన్ 2a ఫోన్ లో వెనుక 50MP (OIS) + 50MP డ్యూయల్ రియర్ కెమెరా మరియు ముందు 32Mp సెల్ఫీ కెమెరా ఉంటాయి. ఈ ఫోన్ 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ మరియు మంచి కెమెరా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ మరియు 45W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కలిగి ఉంటుంది.