flipkart announces big deal on Google Pixel 8a
గూగుల్ పవర్ ఫుల్ ఫోన్ Google Pixel 8a స్మార్ట్ ఫోన్ పై Flipkart భారీ డిస్కౌంట్ అనౌన్స్ చేసింది. భారత మార్కెట్లో 52 వేల రూపాయల సెగ్మెంట్ లో ప్రవేశించిన ఈ ప్రీమియం స్మార్ట్ ఫోన్ ను ఈరోజు ఫ్లిప్ కార్ట్ నుంచి అన్ని ఆఫర్స్ తో కలిపి 34 వేల రూపాయల బడ్జెట్ ధరలో అందుకునే అవకాశం వుంది. గూగుల్ అప్ కమింగ్ Google Pixel 9a లాంచ్ ప్రకటనతో ఈ స్మార్ట్ ఫోన్ రేట్లు భారీగా తగ్గించింది. గూగుల్ ప్రీమియం ఫోన్ ను బడ్జెట్ కారణంగా కొనుగోలు చేయలేక ఆగిపోయిన వారికి ఇది గొప్ప సదవకాశం.
భారత మార్కెట్లో గూగుల్ పిక్సెల్ 8a స్మార్ట్ ఫోన్ రూ. 52,999 రూపాయల బేసిక్ ప్రైస్ తో లాంచ్ అయ్యింది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ రూ. 15,000 రూపాయల భారీ తగ్గింపు అందుకొని ఫ్లిప్ కార్ట్ నుంచి రూ. 37,999 రూపాయల ఆఫర్ ధరలకు అమ్ముడవుతోంది.
ఇది కాకుండా, ఈ ఫోన్ పై రూ. 3000 రూపాయల భారీ డిస్కౌంట్ ఆఫర్ ను కూడా ఫ్లిప్ కార్ట్ ఆఫర్ చేస్తోంది. అదేమిటంటే, ఈ ఫోన్ ను HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ EMI ఆఫర్ తో కొనుగోలు చేసే వారికి రూ. 3,000 భారీ డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ఆఫర్ తో ఈ గూగుల్ ఫోన్ ను కేవలం రూ. 34,999 రూపాయల అతి తక్కువ ధరకు పొందవచ్చు. ఆఫర్ చేయడానికి Click Here
Also Read: విడుదల కంటే ముందే Realme P3 5G ఫోన్ ప్రైస్ రివీల్ చేసిన కంపెనీ.!
ఈ గూగుల్ పిక్సెల్ స్మార్ట్ ఫోన్ 6.1 ఇంచ్ 24 Bit స్క్రీన్ ను గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ తో కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 60-120Hz రిఫ్రెష్ రేట్, 1400 నిట్స్ (HDR) బ్రైట్నెస్ మరియు 2000 పీక్ బ్రైట్నెస్ కలిగి ఉంటుంది. ఈ గూగుల్ ఫోన్ గూగుల్ Tensor G3 చిప్ సెట్ తో పని చేస్తుంది మరియు జతగా 8GB ర్యామ్ తో పాటు 128GB స్టోరేజ్ కూడా కలిగి ఉంటుంది.
ఈ ఫోన్ లో వెనుక 64MP వైడ్ + 13MP అల్ట్రా వైడ్ సెన్సార్స్ కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఈ ఫోన్ కెమెరా మ్యాజిక్ ఎరేజర్, అల్ట్రా HDR, AI కెమెరా ఫీచర్స్ మరియు 60FPS తో 4K వీడియో రికార్డింగ్ వంటి చాలా ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లో 4404 mAh బి బ్యాటరీ మరియు ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ కూడా ఉన్నాయి.