రెండు వారాల క్రితం, HMD గ్లోబల్ నోకియా 6 (2018) కోసం Android ఒరియోని ప్రకటించింది మరియు ఫస్ట్ జెనరేషన్ Nokia 6 ను అప్గ్రేడ్ చేయడానికి వాగ్దానం చేసింది. ఇప్పుడు ఆ సమయం వచ్చింది మరియు ఫస్ట్ జెనరేషన్ నోకియా 6 లేటెస్ట్ Android వెర్షన్ పొందడం ప్రారంభించింది.
అప్గ్రేడ్ సైజ్ 1659 MB, ఈ అప్గ్రేడ్ ఫోన్ లో కొత్త ఫీచర్స్ ని చూడవచ్చు . ఈ రిఫ్రెష్ సెట్టింగ్ UI, పవర్ సేవింగ్స్ మరియు బ్యాక్ గ్రౌండ్ యాక్టివిటీ మేనేజర్ వంటి ఫీచర్స్ ను అందిస్తుంది. HMD తక్కువ కాంతి కెమెరా యొక్క అవుట్పుట్ ని కూడా ట్యూన్ చేసింది. ఈ అప్డేట్ చైనీస్ TA-1000 మరియు గ్లోబల్ TA-1003 వేరియంట్స్ కి లభ్యం .నోకియా 6 స్మార్ట్ఫోన్ ఫీచర్స్ చూస్తే , దీనిలో 2.5D గొరిల్లా గ్లాస్ తో 5.5 అంగుళాల ఫుల్ HD డిస్ప్లేని కలిగి ఉంది. ఈ ఫోన్ క్వాల్కమ్ స్నాప్డ్రాగెన్ 430 ప్రాసెసర్, 3 జీబి ర్యామ్ ని కలిగి ఉంది. ఇది 32GB ఇంటర్నల్ స్టోరేజ్ ను కలిగి ఉంది. ఈ ఫోన్ Android నౌగట్ కలిగి ఉంది.
మీరు ఈ స్మార్ట్ఫోన్ లో కెమెరా సెటప్ ని చూసినట్లయితే,16 మెగాపిక్సెల్ వెనుక కెమెరా మరియు 8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది. ఈ ఫోన్ మెటల్బాడీ కలిగి ఉంది, ఇది చాలా ప్రత్యేక రూపాన్ని ఇస్తుంది.