నోకియా 9 మరియు నోకియా 2 చర్చల మధ్య, HMD గ్లోబల్ నోకియా 7 స్మార్ట్ఫోన్ ని ప్రారంభించింది. ఈ ఫోన్ యొక్క ఫీచర్లు మరియు లక్షణాలు నుండి అనేక మంది అభిమానులను ఆకట్టుకోవడానికి కంపెనీ ట్రై చేస్తుంది . నోకియా యొక్క మొట్టమొదటి ఫ్లాష్ సేల్ నిమిషాల్లో ముగిసింది కనుక మేము ఈ విధంగా చెప్తున్నాము.
నోకియా 7 స్మార్ట్ఫోన్ యొక్క మొట్టమొదటి ఫ్లాష్ సేల్ లో కొన్ని నిమిషాలలో స్మార్ట్ఫోన్ విక్రయించబడింది. వినియోగదారులు ఈ ఫోన్ పై ఎంత ఉత్సాహంగా
వున్నారో స్పష్టంగా చూపిస్తుంది.
150,000 రిజిస్ట్రేషన్లు:
నోకియా 7 యొక్క మొట్టమొదటి సేల్ ధమాఖా తో, కంపెనీ ఇప్పుడు చాలా ధీమాగా వుంది . నోకియా అభిమానులలో ఈ ఫోన్ చాలా ప్రజాదరణ పొందింది. కొన్నిరిపోర్ట్స్ లో ఈ ఫోన్ 150,000 కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్లను అందుకున్నదని తెలిపింది. అక్టోబర్ 31 నుండి ఫోన్ ని షిప్ చేయనున్నారు.
భారతదేశం లో అక్టోబర్ 31 న ప్రారంభించబడుతుంది !
గతంలో భారతీయ మీడియాలో HMD గ్లోబల్ యొక్క ఇన్వైట్ వచ్చింది. ఈ ఇన్వయిట్ లో ఫోన్ యొక్క పేరు ఇవ్వలేదు, కాని ఆశాజనకంగా కంపెనీ లేటెస్ట్ నోకియా7ను విడుదల చేయవచ్చని భావిస్తున్నారు. అక్టోబర్ 31 న భారతదేశంలో ఈ లాంచ్ ఈవెంట్ జరుగుతుంది.