వివో భారతదేశంలో దాని V15 ప్రో స్మార్ట్ ఫోన్నుఈ రోజు మధ్యాహ్నం 12 గంటలకి ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లుచేసింది. అయితే, ముందుగా అధికారిక ప్రకటన చేయకుండానే, ఈ హ్యాండ్సెట్ యొక్క వివరాలు అనేకసార్లు లీక్ చెయ్యబడ్డాయి. ఈ స్మార్ట్ ఫోన్, ఒక పాప్-అప్ కెమెరాతో రానున్న మొట్టమొదటి ఫోన్ కావడం విశేషంగా చెప్పవచ్చు. అలాగే, దీని సంబంధించిన టీజర్ వీడియోలు ఇప్పటికే చాలానే వచ్చాయి. అంతేకాకుండా, వేనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్పుతో ఇది ఉంటుంది. అలాగే, అమెజాన్ ఇండియా అధికారికంగా ఈ స్మార్ట్ ఫోన్ యొక్క కొన్ని వివరాలతో కూడిన చిత్రాలను, దీని కోసం ఏర్పాటుచేసిన ఒక పేజీలో అందించింది. చిత్రాలలో, ముందు పాప్-అప్ షూటర్ మరియు వెనుక ఒక ట్రిపుల్ కెమెరా సెటప్పును వివరిస్తోంది. దీని ప్రకారం, ఈ ఫోన్ ముందు ఒక 32MP కెమెరాతో ఉంటుంది.
వివో వి15 అంచనా స్పెక్స్ :
ఈ హ్యాండ్సెట్ ఒక 48MP ప్రధాన సెన్సార్ 12MP ఎఫెక్టివ్ పిక్సెళ్లతో పోటోలను పంపిణీ చేస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఇన్ -డిస్ప్లే వేలిముద్ర సెన్సారుతో పాటు, దిగువ అంచున, USB టైప్-సి పోర్టుతో పాటు, సిమ్ ట్రే మరియు డౌన్ ఫైరింగ్ స్పీకర్ తో ఈ హ్యాండ్సెట్ ఉంటుంది.
Vivo V15 ప్రో యొక్క ఇతర స్పెసిఫికేషన్ల విషయానికివస్తే, ఇది క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 675 SoC ఆధారితమైనది, ఇది 6GB RAM మరియు 128GB అంతర్గత స్టోరేజితో జతగా వస్తుంది. అంతేకాదు, ఒక స్నాప్డ్రాగన్ 675 చిప్సెట్ ద్వారా ఆధారితమైన మొదటి ఫోన్లలో, ఇది కూడా ఒకటిగా ఉంటుంది. ఈ స్మార్ట్ ఫోన్ ఒక 6.4-అంగుళాల సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. ఇది ఇప్పుడు ఇన్-డిస్ప్లే వేలిముద్ర సెన్సార్ తో ఉన్నట్లు ధ్రువీకరించబడింది. ఇది ఒక 3700mAh బ్యాటరీ యొక్క మద్దతు ఇస్తుంది. ఈ హ్యాండ్సెట్ వెనుక ఉన్న 48MP ప్రధాన కెమెరా శామ్సంగ్ సెన్సారుగా చెప్పబడుతుంది. మిగిలిన రెండు కెమెరాలు 8MP మరియు 5MP సెన్సార్లను కలిగి ఉండవచ్చు.