Exclusive : శామ్సంగ్ గెలాక్సీ M10 ధర Rs 8990, గెలాక్సీ M20 రిటైల్ ధర Rs 12,990
చైనీయ కంపెనీల నుండి వస్తున్నా పోటీని ఢీకొట్టడానికి శామ్సంగ్, తన శామ్సంగ్ గెలాక్సీ -M సిరీస్ అస్త్రాన్ని సంధించనుంది.
ముఖ్యాంశాలు :
1. శామ్సంగ్ గెలాక్సీ M10 ధర Rs 8990, గెలాక్సీ M20 రిటైల్ ధర Rs 12,990
2. శామ్సంగ్ గెలాక్సీ M10 రెండు వేరియంట్లలో రావచ్చు
3. ఈ ఫోన్లు జనవరి 28 న ఇండియాలో విడుదలకానున్నాయి
ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుచేయాలంటే, ముందుగా మనకు గుర్తొచ్చే కంపెనీ పేరు, శామ్సంగ్. కానీ, కొత్త తీసుకురానున్నగెలాక్సీ -M సిరీసుతో, ఈ అభిప్రాయాన్ని మార్చనున్నది. ప్రస్తుతం, మిడ్ రేంజ్ విభాగంలో పాపులర్ అయినటువంటి, షావోమి, రియల్మీ మరియు హానర్ వంటి కంపెనీలకు గట్టి పోటీనివ్వడానికి, తన J- సిరీస్ స్థానంలో ఇప్పుడు ఈ గెలాక్సీ -M సిరీసును ప్రవేశపెట్టనుంది.
అయితే, శామ్సంగ్ 2018 సంవత్సరంలో కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో, A-సిరీస్ తీసుకొచింది. ఇందులోభాగంగా, శామ్సంగ్ A7 మరియు శామ్సంగ్ A9 స్మార్ట్ ఫోన్లలో ట్రిపుల్ కెమెరా సేటప్పును కూడా అందించింది. అయితే, ఇవ్వనికూడా ఈ చైనా కంపెనీల యొక్క ప్రాబల్యాన్ని ఏమాత్రం తగ్గించలేకపోయాయి. కానీ, ఇప్పుడు ఈ శామ్సంగ్-M సిరీస్ ఫోన్లలో ఇన్ఫినిటీ V-డిస్ప్లే మరియు పెద్ద 5000mAh బ్యాటరీ వంటి మరికొన్ని ప్రత్యేకతలను తీసుకురానుంది.
మూలాల ఆధారంగా, శామ్సంగ్ గెలాక్సీ M10 ధర Rs 8990 గా ఉండవచ్చని మరియు గెలాక్సీ M20 ధర Rs 12,990 గా ఉండవచ్చని తెలుసుకున్నాము. ఆన్లైన్లో వచ్చిన లీక్స్ ద్వారా ఇది జనవరి 28 న ఈ స్మార్ట్ ఫోన్లను విడుదల చేయడానికి, షెడ్యూల్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది.
ఈ శామ్సంగ్ గెలాక్సీ M10 యొక్క స్పెక్స్ Geekbench మీద ఆవిష్కరించబడ్డాయి. దీని ప్రకారంగా, ఈ ఫోన్ శామ్సంగ్ యొక్క ఎక్సినోస్ 7870 ఆక్టా కోర్ ప్రాసెసరుతో వస్తుంది. ఈ ఫోన్, 3GB ర్యామ్ కలిగి, 16GB మరియు 32GB స్టోరేజిలలో అందుబాటులో ఉంటుంది. 16GB వేరియంట్ రూ. 8,999 ధరతో ఉంటుండగా, 32GB వేరియంట్ ధర కొంత అధికంగా ఉండవచ్చు. ఇది ఒక 6.5 అంగుళాల డిస్ప్లేతో ఉండవచ్చు, కానీ ఇది అమోల్డ్ స్క్రీన్ కాకపోవచ్చు.
ఇక ఈ శామ్సంగ్ గెలాక్సీ M20 ఫోన్ కొన్ని ప్రత్యేకమైన స్పెక్స్ తో ఉంటుంది. ఇది ఇన్ఫినిటీ -V డిస్ప్లే అని పిలిచే డిస్ప్లేతో రానుంది. అయితే, ఇది మీరేమికాదు వాటర్ డ్రాప్ నోచ్ డిస్ప్లే . కానీ, శామ్సంగ్ నుండి రానున్న మొదటి నోచ్ గ ఉంటుంది. అలాగే, ఇది 13MP 1.12um పిక్సెల్ సైజు సెన్సారుతో జతగా 5MP డెప్త్ సెన్సార్, పోర్ట్రైట్ వంటివాటికి సహకరిస్తుంది. ఈ ఫోనులో, ఒక పెద్ద 5,000 mAh బ్యాటరీని తీసుకొచ్చింది.