ఇండియన్ మార్కెట్ లో కొత్త ఫోన్ ను లాంచ్ చేయడంలో ఐకూ తలమునకలయ్యింది. డిసెంబర్ 12న ఇండియన్ మార్కెట్ లో ఈ ఫోన్ ను లాంచ్ చేస్తోంది. అదే, iQOO 12 5G మరియు Snapdragon 8 Gen 3 ప్రోసెసర్ తో ఇండియన్ మార్కెట్ లో విడుదలవున్న మొదటి ఫోన్ ఇదే అవుతుంది. ఈ ఫోన్ లో కొత్త సూపర్ కంప్యూటింగ్ చిప్ సెట్ ను కూడా జత చేసినట్లు తెలుపడంతో ఈ ఫోన్ పైన అంచనాలు మరింతగా పెరిగాయి. ఈ ఫోన్ ను ఓవరాల్ పెర్ఫార్మెన్స్ తో తీసుకు వస్తున్నట్లు ఫోన్ టీజ్డ్ స్పెక్స్ మరియు ఫీచర్లు చూస్తుంటే అర్ధమవుతోంది. అందుకే, ఈ ఫోన్ వివరాలు మరియు ఫస్ట్ లుక్ ను డిజిట్ ఎక్స్ క్లూజివ్ గా అందిస్తోంది.
ఈ ఫోన్ డిజైన్ పరంగా సరికొత్త బ్యాక్ ప్యానల్ డిజైన్ తో వచ్చింది. అంతేకాదు, ఈ ఫోన్ లెజండ్ మరియు ఆల్ఫా అనే రెండు కలర్ ఆప్షన్ లతో వస్తుంది. వీటిలో లెజండ్ కలర్ ఫోన్ BMW M Motorsport బ్రాండింగ్ తో వస్తుంది. ఈ ఫోన్ లో సరికొత్త కెమేరా సెటప్ ను కూడా కంపెనీ అందించింది. ఇందులో రౌండ్ కార్నర్స్ కలిగిన మూలలు మరియు పెద్ద బంప్ వుంది.
దీనికి ముందు తరం ఫోన్ iQOO 11 తో పోలిస్తే iQOO 12 5G చాలా వినూత్నమైన డిజైన్ ను కలిగి వుంది. iQOO 12 చూడటానికి మాత్రమే కాదు చేతిలో కూడా ప్రీమియం ఫీల్ అందిస్తుంది. ఇక ఫీచర్స్ మరియు స్పెక్స్ గురించి ప్రత్యేకంగా చెప్పవచ్చు.
Also Read : Tecno Spark Go (2024): Dynamic Port ఫీచర్ తో బడ్జెట్ ఫోన్ వస్తోంది.!
ఐకూ 12 5జి ఫోన్ యొక్క చాలా కీలకమైన వివరాలను ఇప్పటికే కంపెనీ అందించింది. ఇందులో ఫోన్ యొక్క ప్రోసెసర్ మరియు కేమేరా వివరాలు ఉన్నాయి.
ఐకూ 12 5జి స్మార్ట్ ఫోన్ Snapdragon 8 Gen 3 మరియు జతగా ఐకూ Q1 సూపర్ కంప్యూటింగ్ చిప్ సెట్ తో వస్తోంది. అంతేకాదు, ఈ ఫోన్ లో LPDDR5X RAM మరియు UFS 4.0 స్టోరేజ్ లతో ఈ ఫోన్ బ్లేజింగ్ స్పీడ్ పెర్ఫార్మన్స్ అందిస్తుంది. ఈ ఫోన్ గరిష్టంగా 21 లక్షలకు పైగా AnTuTu స్కోర్ ను మార్క్ దాటిందని కూడా కంపెనీ తెలిపింది.
ఈ ఫోన్ లో భారీ కెమేరా సెటప్ ను కూడా కలిగి వుంది. ఈ ఫోన్ లో 50MP + 50MP + 64MP భారీ కెమేరా సెటప్ ను కలిగి వుంది. ఈ సెట్ కెమేరా 100X జూమ్ చెయ్యగల సత్తా కలిగి వుంది. ఈ ఫోన్ లాంచ్ కంటే ముందే మరిన్ని స్పెక్స్ ను ఐకూ అందించే అవకాశం వుంది.