Coolpad భారత్ లో రెండు కొత్త స్మార్ట్ ఫోన్స్ లాంచ్ తయారీ లో వుంది . వీటిలో ఒక డివైస్ లో 18:9 డిస్ప్లే కలదు రెండవ ఫోన్ యొక్క ఫ్రంట్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ కలదు . అయితే వీటి ధరలు మరియు సేల్స్ కి గురించి ఇంకా సరైన సమాచారం లేదు .
ఇదే కాక ,Coolpad దాని విజయవంతమైన ప్లే 6 స్మార్ట్ఫోన్ ను ఒక కొత్త కలర్ వేరియంట్లో ప్రారంభించనుంది. ఈ డివైస్ క్లాసిక్ బ్లాక్ కలర్ లో అందుబాటులో కలదు . Coolpad Play 6 ముందర గోల్డ్ కలర్ లో వచ్చింది . ఇది స్నాప్ డ్రాగన్ 653, 6GBRAM కలిగి రేర్ డ్యూయల్ కెమెరా సెటప్ కలిగి వుంది .
చైనా స్మార్ట్ఫోన్ తయారీదారు కూల్ పాడ్ మెగా 4A ను ముందుగా ప్రకటించారు, ఇది వచ్చే సంవత్సరంలో భారతదేశంలో ప్రారంభించబడుతుంది . అంతేకాకుండా, కంపెనీ ఫ్లాగ్షిప్ డివైస్ కూల్పాడ్ ఎస్ 1 చేంజర్ కూడా ఈ ఏడాది భారతదేశంలో ప్రారంభించనుంది. ఇటీవల దుబాయ్ లో జరిగిన ఒక కార్యక్రమంలో, కూల్పాడ్ ప్లే 6 తో మెగా 4A మరియు కూల్పాడ్ ఎస్ 1 ప్రకటించారు. ఆ సమయంలో కంపెనీ మెగా 4A ధర రూ. 5,999 మరియు ఈ స్మార్ట్ఫోన్ భారతదేశం లో దీపావళి ముందు విడుదల చేయబడుతుంది.
కూల్ పాడ్ S1 స్నాప్డ్రాగన్ 821 చిప్సెట్ తో నడుస్తుంది . మరియు 5.5 అంగుళాల FHD డిస్ప్లే మరియు 16MP వెనుక కెమెరా కలిగి ఉంది. ఇప్పటి వరకు, ఈ డివైస్ యొక్క భారతీయ ధర గురించి సమాచారం రాలేదు , కానీ ఈ ఫోన్ చైనాలో 2599 యువాన్ (సుమారు 26,000 రూపాయల ధర) కు విక్రయించబడింది.